“జుట్టు పునరుద్ధరణ శస్త్రచికిత్స దుష్ప్రభావాలు -హెయిర్ లాస్ కెమోథెరపీ మెకానిజమ్”

ప్రభుత్వ నిర్లక్ష్యం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఆశలపై నీళ్లు చల్లింది. అధికారంలోకి వచ్చీరాగానే మినీ ఇండస్ట్రీయల్‌ పార్కు (లఘు పారిశ్రామిక వాడ)ల ఏర్పాటు చేస్తామనే చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. జిల్లాల వారీగా భూములు గుర్తించండని..

07/09/2016: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ గురువారం న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ మీద కనిపించనున్నారు. పుణెకు చెందిన ఓ డిజైనింగ్ ఇన్ స్టిట్యూట్ తరఫున ఆమె షోస్టాపర్ గా కనువిందు చేయనున్నారు. బాలికల విద్యను, చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఆమె ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. యువ డిజైనర్ల ప్రతిభను చాటేందుకు పుణెకు చెందిన ఛేసా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ సంస్థ ఈ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో రైతులు, కూలీల పిల్లలు రూపొందించిన చేనేత వస్త్రాలను ప్రదర్శించనున్నారు. ఇండో-వెస్ట్రన్ శైలిలో రూపొందించిన ఓ విశిష్టమైన చేనేత వస్త్రాన్ని ధరించి అమృత ఫడ్నవిస్ ర్యాంప్ మీద కనిపించనున్నారు. ‘బాలికల విద్యను ప్రోత్సహించాలన్న సందేశంతో నేను ర్యాంప్ మీద నడవబోతున్నాను. నిజానికి ఈ చేనేత వస్త్రాలను రైతులు, రైతు కూలీల పిల్లలు రూపొందించారు. వారి ప్రతిభను లోకానికి చాటే ఈ కార్యక్రమం గొప్ప వినూత్నమైనది. ఒక బాలికను చదివిస్తే కుటుంబాన్ని చదివించినట్టు అవుతుంది. కుటుంబమంతా విద్యావంతులైతే అప్పుడు దేశం పురోగమిస్తుంది.’ అని అమృత ఫడ్నవిస్ మీడియాతో తెలిపారు. గతంలో గిరిజన కళలతో కూడిన చేనేత వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసిన ఆమె.. ఈసారి యువ డిజైనర్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నట్టు తెలిపారు.

03/09/2016: అంకారా : పెళ్లి వేడుకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టర్కీ సంచలన నిర్ణయం తీసుకుంది. హంగు ఆర్భాటాలతో బయట జరిగే వేడుకలపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. భద్రతా కారణాల కోసం బహిరంగ వివాహాలను రద్దు చేస్తున్నట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన భద్రతా చర్యలు.. టర్కీ వ్యాప్తంగా బహిరంగంగా వివాహాలు, ఎంగేజ్మెంట్ కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఇండోర్ వివాహాలు నిర్వహించే వారుకూడా ముందస్తుగా అధికారులకు తెలుపాలని, భద్రతా దళాలు తాము ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టర్కీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను పాటించని వారిపై దుష్ప్రవర్తన చట్టం కింద జరిమానా విధించనున్నట్టు అధికారులు తెలిపారు. గత నెలలో గేసియెంట్ప్ నగరంలో జరిగే స్ట్రీట్ వెడ్డింగ్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో భద్రతా చర్యలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. ఆ దాడిలో 34 చిన్నారులతో పాటు 56 మంది మృతిచెందగా., 100 మంది గాయాలు పాలయ్యారు. ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఇస్తామిక్ స్టేట్(ఐఎస్) హస్తమున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

28/05/2016: ‘దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రధాని మోదీ ప్రవేశపెట్టారు. అవినీతి రహితంగా, పారదర్శకంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుని ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని’ ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ అన్నారు. గురువారం మోదీ రెండేళ్ల పాలనపై పాలమూరులో ‘వికాస్‌ పర్వ్‌’ పేరిట నిర్వహించిన సభలో..అంతకు ముందు విలేకరుతోనూ మాట్లాడారు. ‘అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మోదీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది. పదేళ్లు దేశాన్ని పాలించిన మన్మోహన్‌సింగ్‌ ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదు. దేశంలో కాంగ్రెస్‌ అచూకీ క్రమంగా గల్లంతవుతోంది. మోదీ నేతృత్వంలోని భాజపా మరో పదేళ్లు దేశాన్ని పాలిస్తుంది. నీతి అయోగ్‌లో రాష్ట్రాలకు భాగస్వామ్యం పెంచి..నిధుల్లోనూ ప్రాధాన్యం కల్పించిన ఘనత ఆయనదే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి భాజపా ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు 14 వేలకోట్లు, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఔషధ పరిశోధన కేంద్రం ఏర్పాటు కానున్నాయి. కాంగ్రెస్‌ పరిపాలనలో ఖాయిలా పడిన రామగుండం ఎరువుల పరిశ్రమ, మంచిర్యాల సిమెంటు పరిశ్రమ, ఐడీపీఎల్‌, వరంగల్లులోని జౌలి పరిశ్రమను కేంద్రం పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు’ రమణ్‌సింగ్‌ పేర్కొన్నారు. తెలంగాణలో భాజపాకు ఇప్పుడు ఐదుగురే ఎమ్మెల్యేలు ఉన్నారు. భవిష్యత్తులో వంద మందికి చేరి భాజపా రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నక్సల్‌ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామన్నారు. కరవు నిధుల కేటాయింపుపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎరువులు, రసాయినాలశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహిర్‌ సమాధానమిస్తూ..చిన్న రాష్ట్రమైనా తెలంగాణకు రూ.791 కోట్లు మంజూరుచేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి 90 వేల గృహాలు మంజూరైనా ఒక్కటీ ప్రారంభించకపోవడం దారుణమని లక్ష్మణ్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మోదీ విజయాలు.. తెరాస వైఫల్యాలు: రెండేళ్ల పరిపాలనలో తెరాస రాష్ట్రంలో ఒరగబెట్టిందేమీ లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ‘మాపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తెలంగాణలో పేదలు, రైతుల పక్షాన పోరాటం చేస్తాం. పల్లె పల్లెకు భాజపా, ఇంటింటికీ మోదీ నినాదంతో ప్రతి ఇంటికీ తిరిగి ప్రచారం చేస్తాం. పాలమూరు జిల్లాలో తీవ్ర కరవు ఏర్పడి..13 లక్షల మంది వలసపోయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోపోవడం సిగ్గుచేటు. పాలమూరును దత్తత తీసుకుంటామంటూ ఉద్యమంలో చెప్పిన తెరాస జిల్లాకు చేసింది ఏదీ లేదు. తెరాస వైఫల్యాలను, మోదీ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని’ వివరించారు. అసోంలో భాజపాకు దక్కిన విజయం స్ఫూర్తితో రానున్న రోజుల్లో తెలంగాణలోనూ భాజపా జెండా ఎగరేస్తామని లక్ష్మణ్‌ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్దార్థనాథ్‌, రాష్ట్ర నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి, నాగూరావ్‌ నామోజీ, రతంగ్‌ పాండురెడ్డి, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భాజపా కార్యకర్తలు హాజరయ్యారు.

శరీరంలో అధిక బరువు, పొట్ట అందానికి ఆరోగ్యానికి సమస్యాత్మకంగా మారుతాయి. ఇవి ఆత్మ న్యూనతకి గురిచేసి అత్యంత నష్టాన్ని కలిగిస్తాయి. ఈ అధిక బరువు లావు పొట్ట వల్ల గురక నుంచి గుండె జబ్బుల వరకు బీపీ నుంచి షుగర్ వరకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. బరువు తగ్గించుకోవడం కష్టం, కొవ్వు తగ్గించుకోవడం మరింత కష్టం. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానంతో ఇది సులభతరంగా మారింది.

శ్రీకాకుళం : ఓ వైపు స్థానిక ఎమ్మెల్యే.. మరోవైపు మున్సిపల్ ఛైర్మన్.. ఇరువురి మధ్య మున్సిపల్ ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో విధులు నిర్వహించలేకపోతున్నామని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఇప్పుడిదే శ్రీకాకుళం జిల్లా పలాసలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

11/11/2016: అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయదుంధుభి అమెరికన్లనే కాక ప్రపంచదేశాలనూ ఆశ్చర్యపరచింది. ట్రంప్ గెలుపుపై ఆయన మద్దతుదారులు ధీమాగానే ఉన్నా డెమోక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ దే హవా అని అంతా అనుకున్నారు. ఎగ్టిట్ పోల్స్, సర్వేలు కూడా తర్వాతి అధినేత హిల్లరీయే అని జోస్యం చెప్పాయి. లాస్ట్ మినిట్ లో కాలిక్యులేషన్ కాస్త అటుఇటు అయినా అమెరికాకు తొలి మహిళా అధినేత్రి ఖాయమని నిర్ణయానికొచ్చేశారంతా. కానీ, అంచనాలు తలకిందులు చేస్తూ ట్రంప్ విజయఢంకా మోగించి మిస్టర్ ప్రెసిడెంట్ అయ్యారు. ఎన్నికల తంతు ముగిసిపోవడంతో.. ఇప్పుడు ట్రంప్ వల్ల లాభనష్టాలపై అన్ని దేశాలూ లెక్కలు ప్రారంభించాయి. ఆస్ట్రేలియా అయితే కాస్త టెన్షన్ లో ఉందట. ట్రంప్ దూకుడు విధానాలతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అస్థిరత్వానికి దారితీసే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా భద్రతా నిపుణులు అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీజియన్ లో అమల్లో ఉన్న ఒబామా విదేశీపాలసీ అటకెక్కితే చిక్కులు తప్పవంటున్నారు. దీంతో ట్రంప్ విధానాలకు తగినట్టుగా సాధ్యమైనంత త్వరగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జాతీయ భద్రత, వ్యూహాత్మక విధానాల్లో మార్పులు చేయాలని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రభుత్వానికి సూచించారు. ”అమెరికాకి ఆస్ట్రేలియా బలమైన, నమ్మకమైన భాగస్వామి. ట్రంప్ నాయకత్వంలో కూడా ఇరుదేశాల మధ్య బంధం అదే విధంగా కొనసాగాలి” అని ఆమె ఆకాంక్షించారు. దక్షిణ కొరియా, జపాన్ దేశాలు అణ్వస్త్రాలను సంపాదించుకోవాలని సూచించిన ట్రంప్ఒబామా విదేశాంగ విధానాలను తీవ్రంగా తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో అమెరికా వ్యూహాత్మక సంబంధాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ భారీ మార్పులు చేసే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ స్ట్రాటజిక్ డిఫెన్స్ స్టడీస్ సెంటర్ ప్రొఫెసర్ పీటర్ డీన్ హెచ్చరించారు. కాగా ఆస్ట్రేలియాకి వచ్చే నాలుగేళ్లు గడ్డుకాలమేనని మరో ప్రొఫెసర్ రోరీ మెడ్ కాఫ్ అభిప్రాయపడుతున్నారు. ఒబామా ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ట్రాన్స్-పసిఫిక్ పార్టనర్షిప్ ఒప్పందం భవిత కూడా సందిగ్ధంలో పడే అవకాశం ఉందని అంటున్నారు.

హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావును పదవి నుంచి తొలగించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, టీ.కాంగ్రెస్ నేత కె.మహేష్, ఎబివిపి నేత రాకేష్ పాల్గొని, మాట్లాడారు. రోహిత్ మృతి ఘనటలో ప్రధాన నిందితుడుగా ఉన్న వీసీ అప్పారావును అరెస్టు చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

ఆదిలాబాద్ జిల్లాలో లభించే కలపను బంగారంతో పోలుస్తారు. అత్యంత నాణ్యతగా ఉండే ఈ కలపను స్మగ్లర్లు యథేచ్చగా కొల్లగొడుతున్నారు. కలప తరలింపునకు కాదేదీ అనర్హం అన్నట్లు ఆటోలు, కార్లు, డీసీఎం వ్యాన్లు, లారీలు ఇలా ప్రతి వాహనంలో కలప తరలిపోతూనే ఉంది.. వందల సంవత్సరాల వయస్సున్న పెద్దపెద్ద టేకు వృక్షాలను నరికివేస్తుండటంతో వనం బోసిపోతోంది.  అటవీ శాఖ అధికారుల నిఘా లేకపోవడంతో లక్షల విలువ చేసే కలప అక్రమంగా రవాణా అవుతోంది.

ఏదీ ఏమైనా ఇప్పుడు ఈ ఫొటోలు బయటపడటంతో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఈ పవిత్ర కలియిక , ఇప్పడు హైలైట్ అయ్యింది. ఒకపక్క తెలుగు దేశంతో మిత్రపక్షంలో ఉండి.. మిత్రధర్మ పాటిస్తున్నాం అని ఎగిరెగిరి పడే సోము వీర్రాజు.. టీడీపీ తో మిత్రపక్షంలో ఉండగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏదైనా అంటే…టీడీపీపై చంద్రబాబుపై విమర్సలు గుప్పించడం. ఇక టైం వచ్చేసింది అనుకున్నారో ఏమో, నెమ్మదిగా అసలు రంగులు బయట పెట్టేస్తున్నారు… కలిసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కలిసి పూజలు చేస్తున్నారు. మరి దీనికి బీజేపీ ఏం సమాధానం చెబుతుందో… లేకపోతే ఎలాగూ నిజం బయటపడింది ఏమన్నా లైట్ తీసుకుంటారో చూద్దాం ఏం జరుగుతుందో… ఏదేమైనా బీజేపీ మిత్రధర్మ అంటే కొత్త అర్ధాన్ని చెప్పింది. ఇదే “కొత్త మిత్ర” ధర్మం..

* ఆందోళన: దీర్ఘకాలం ఆందోళనతో సతమతమయ్యేవారికి కుంగుబాటు వంటి మానసిక సమస్యల ముప్పూ ఎక్కువే. వ్యాయామంతో వీటి బారినపడకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ఆందోళన ముప్పు 25% తక్కువగా ఉంటున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి. వ్యాయామం మూలంగా మనసును ఉత్సాహపరిచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ముఖ్యంగా ధ్యానం వంటి శ్వాస సంబంధ పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. మిగతా వ్యాయామాలూ పనికొస్తాయి. వీటిని ఎక్కువగా చేస్తే ఫలితమూ అధికంగా ఉంటుంది.

ఢిల్లీ : జెఎన్ యూలో జాతి వ్యతిరేక నినాదాల కేసులో ఉమర్ ఖలీద్, అనిర్బన్ బట్టాచార్యలు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఉమర్ ఖలీద్, అనిర్బన్ పై జాతి వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమర్, అనిర్బన్ లు ఫిబ్రవరి 24 న పోలీసులకు లొంగిపోయారు.

మసాల పదార్థాలు, కారం ఎక్కువున్న పదార్థాలు తినేవారిలో, సమయానికి ఆహారం తీసుకోని వారిలో ఎసిడిటి పెరుగుతుంది. దీని వల్ల ‘లారింగో ఇసోఫేగల్‌ రిఫ్లక్స్‌’ వస్తుంది. కడుపులోని ఆమ్లాలు పైకి వచ్చి స్వరపేటికకు వ్యాపించడం వల్ల కూడా స్వరం మారే అవకాశముంది. ఈ సమస్య తగ్గడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. గొంతుబొంగురపోయినప్పుడు ఇన్‌ఎన్‌టి డాక్టర్‌ను కలవాలి. ల్యారింగోస్కొప్‌/ఎండొస్కోప్‌/ఫ్లెక్సిబుల్‌ ల్యారింగొస్కోప్‌ ద్వారా పరీక్షిస్తారు. వీటి వల్ల స్వరపేటికలో కలిగే మార్పులను గుర్తిస్తారు. దీనికి ఎలాంటి చికిత్స చేయాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఈ సమస్యలన్నీ మనం తొలిదశలోనే గుర్తించే వీలుంది. అంటే గొంతు మారడాన్ని గొంతుబొంగరు పోవడాన్ని చాలా సులభంగా గుర్తించొచ్చు. నిర్లక్ష్యం చేయకుండా ఇఎన్‌టి వైద్యున్ని సంప్రదించాలి. కొన్ని జబ్బులు ముదరకుండా చికిత్స చేసేవీలుంది. కొన్ని క్యాన్సర్లను తొలిదశలోనే నయం చేసుకోవచ్చు.

వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన శరీరంలోని వివిధ అవయవాలపై దుష్ర్పభావాలు చూపిస్తుంటాయి. చర్మం , కళ్లపైనే కాకుండా , ఊపిరితిత్తులపైన కూడా ఈ ప్రభావాలు ఉంటాయి. శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో సూక్ష్మంగా ఉండే పదార్థాలు ఊపిరితిత్తులో చేరుతాయి. వీటిలో ఎక్కువ భాగం శ్వాస నాళాలలోని ద్రవ పదర్థాలలో చేరి కఫం ద్వారా బైటికి నెట్టివేయబడతాయి. వ్యాధి నిరోధక శక్తి కలిగించే ఐజి-ఎ యాంటిబాడీస్‌ శ్వాస నాళాలలో చేరే క్రిముల నుండి దేహాన్ని రక్షిస్తాయి. తెల్ల రక్తకణాలు కూడా దీనికి దోహదపడతాయి.

ఎదైనా సరే మితంగా ఉండాలి, అంటే సరిపడా ఉండాలి, ఎక్కువైతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి, మన అందమైన ముఖంలో మరింత అందమైనవి మన కళ్ళు, కాని ఈ కళ్ళ పక్క చర్మం ముడతలు పడి బాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి, అందులో మనకెంతో ఇస్టమైనవే అయినప్పటికీ, ప్రమాదకరమైనవి 3, అవి ఏమిటంటే

ఇది రక్తా న్ని శుద్ధి చేస్తుంది. విటమిన్స్‌ కూడా లభి స్తాయి. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

• రెండు టీ స్పూన్‌ల కుంకుడుకాయ పొడిని రెండు స్పూన్‌ల ఉసిరి పొడిని మరో రెండు స్పూన్‌ల తేనెతో కలిపి ఆ పేస్ట్‌ని తల మొత్తానికి పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపుతో స్నానం చేయండి. తేడా మీకే తెలుస్తుంది.

శ్రీనగర్‌: టీ20 సెమీ ఫైనల్స్‌లో భారత్‌ ఓడిపోవడంపై జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో కళాశాలలోని కశ్మీరీ విద్యార్థులకు, కశ్మీరీయేతర విద్యార్థులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో కళాశాలను శుక్రవారం మూసేశారు. శనివారం కూడా కళాశాల తెరుచుకోలేదు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభించాలా? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ అధికారులు సమావేశం కానున్నారు. కళాశాల అధికారులు ముందు జాగ్రత్త చర్యగా స్థానిక విద్యార్థులు హాస్టల్‌ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో చాలా మంది స్థానిక విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లారు. గురువారం రాత్రి టీ20 సెమీఫైనల్‌లో భారత్‌పై వెస్టిండీస్‌ గెలవడంతో కొందరు కశ్మీరీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. దీంతో కశ్మీరీలు కాని విద్యార్థులకు, కశ్మీరీ విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నట్లు క్యాంపస్‌ వర్గాలు తెలిపాయి. పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *