“అవసరమైన 17 జుట్టు పెరుగుదల చమురు సమీక్షలు |జుట్టు నష్టం వార్తలు మార్చి 2015”

నీస్ కోట్ డీ’అజుర్ ఎయిర్‌పోర్ట్ (French: Aéroport Nice Côte d’Azur) (IATA: NCE, ICAO: LFMN) అనేది నీస్‌లోని ఒక ఎయిర్‌పోర్ట్, ఆల్పెస్-మేరిటైమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్రాన్స్‌లో భాగంగా ఉంటోంది. ప్యారీస్‌లోని చార్లెస్ డీ గౌలే ఎయిర్‌పోర్ట్ మరియు ఓర్లీ ఎయిర్‌పోర్ట్‌ల తర్వాత ఫ్రాన్స్‌లోనే ఇది మూడో ముఖ్యమైన విమానాశ్రయం. ఎల్’ఎరేనాస్ సమీపంలోని ప్రొమెనడే డెస్ యాంగ్లస్‌పై ఉన్న ఈ విమానాశ్రయం రెండు టెర్మినల్స్‌ని కలిగి ఉంది. ఈ విమానాశ్రయం మొనాకోకు అత్యంత సామీప్యంలో ఉన్న కారణంగా, దానికి సంబంధించిన సిటీ-స్టేట్స్ ఎయిర్‌పోర్ట్‌గా కూడా సేవలందిస్తోంది, నగరానికి మరియు ఎయిర్‌పోర్ట్‌కు మధ్య హెలిక్యాప్టర్ సౌకర్యం అందుబాటులో ఉంది.

13/07/2016: జమ్మూకశ్మీర్: కశ్మీర్ లోయలో కొనసాగుతున్న అల్లర్లలో తీవ్రంగా గాయపడిన కొందరు యువకులు తమ కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. బుధవారం కశ్మీర్ అశాంతిపై.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలను లక్ష్యంగా చేసుకొని ఆయన వరుస ట్వీట్లు చేశారు. గాయపడిన యువకులకు వైద్య సేవలు అందించడానికి మోదీ డాక్టర్ల బృందాన్ని పంపించాలని ఆయన కోరారు. కేరళ కొల్లాం ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు.. మోదీ డాక్టర్ల బృందాన్ని వెంట తీసుకెళ్లిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ప్రధాని కంటి డాక్టర్ల బృందాన్ని కశ్మీర్ లోయకు పంపాలని ఆయన కోరారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 1200 మందికి పైగా యువత తీవ్రంగా గాయపడ్డారని వారికి సరైన వైద్యం అందటంలేదని ఒమర్ పేర్కొన్నారు.

మన శరీరంలో ఏ అంగనికైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ వద్దకు పరిగెడతాం. అయితే చర్మానికి సమస్య వస్తే కాసింత ఆలస్యంగా వెళతాం. ఆ సమయానికి సమస్య కాస్తా ఎక్కువైపోతుంది.ఫలితంగా ఎన్నో డబ్బులు ధారపోస్తాం. కానీ మార్పు రావటం మాట అలా ఉంచినా ఫలితం మాత్రం సూన్యం. ఎందుకంటే చర్మ సమస్య మొదలైతే అది తొందరగా తీరదు. ఈ మాట నూటికి నూరుపాళ్ళు నిజం. పుట్టడం తోనే చక్కని చర్మంపొందడం కుదరని విష యం. జన్యు పరమైన మార్పుల కారణంగా చర్మం అనేక మార్పులు చెంది మనకు చుట్టుకుని ఉంటుంది. చర్మం యొక్క రంగు వారసత్వంపై కూడా ఆధారపడవచ్చు.

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. వర్మతో పోలీసు నేపథ్యంలో తెరకెక్కే స్టైలిష్‌ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని నాగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు….

పాట్నా: ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం విఫలమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వంపై యువతకు రానురాను విశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పారు. బీహార్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మోదీ ప్రభుత్వం విమర్శలు చేశారు. ఇదే వేధిక నుంచి ఢిల్లీలో రానున్న కాలంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని పరోక్షంగా చెప్పారు. లోక్సభ ఎన్నికలకు ముందు విదేశాల్లో ఉన్న నల్లధనం మొత్తాన్ని తిరిగి భారత్కు తెప్పిస్తామన్న మోదీ.. అధికారంలోకి వచ్చాక మాత్రం యోగా చేయమంటున్నారని ఆరోపించారు. ఎలాంటి ఫలితం ఇవ్వని స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రచారం కోసం కోట్ల రూపాయలు వెచ్చించారని విమర్శించారు. దీనివల్ల కనీసం ఒక్క వీధి కూడా శుభ్రంగా కనిపించడంలేదని కేజ్రీవాల్ చెప్పారు. బీహార్ ప్రజలు ఎలాంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ప్రశ్నించగా ప్రస్తుతం రెండు మోడల్ ప్రభుత్వాలు ఉన్నాయని అందులో ఒకటి ఢిల్లీ ప్రభుత్వం కాగా మరొకటి కేంద్రప్రభుత్వం అని ఇందులో ఎలాంటి తరహా ప్రభుత్వాన్ని కోరుకుంటారో ఢిల్లీ ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి లో ‘ఈనాడు’ కంట్రీ బ్యూటర్’ గా జర్నలిజం జీవితం ఆరంభించిన వడ్డే వెంకటేశ్వర రావు గారు ఇప్పుడు 10 టీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా నియమితులయ్యారు. జీ టీవీ లో పనిచేసిన సతీష్ కమల్ (అసలు పేరు సత్యనారాయణ అట) స్థానంలో వడ్డే నియమితులయ్యారు. ఇప్పుడు సతీష్ ఏమి చేస్తారో తెలియదు. 

మాస్ సినిమాల్లో విలన్ ఎంత శక్తివంతంగా ఉంటే…. హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది.  ఇది కమర్షియల్ ఫార్ములా. ఈ ఫార్ములాతో తీసిన ప్రతి సినిమా హిట్టే. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి… తన సినిమాల్లో తప్పకుండా ఈ సూత్రాన్ని పాటిస్తాడు. త్వరలో ఆయన చేయనున్న క్రేజీ మల్టీస్టారర్లో ఈ ఫార్ములానే హైలైట్ కానుదని తెలుస్తోంది. వివరాల్లోకెళ్తే… ఎన్టీయార్, చరణ్ కలిసి నటించే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మరో స్టార్ హీరోని సెట్ చేశాడట దర్శక ధీరుడు. ఆ స్టార్ ఎవరో కాదు… మాస్ మహారాజా రవితేజ. అవును… రాజమౌళి మల్టీస్టారర్ లో రవితేజ విలన్ గా నటిస్తున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.  రవితేజకు కథ కూడా వినిపించేశాడట రాజమౌళి. విలన్ పాత్ర అత్యంత శక్తివంతగా ఉండటంతో మాస్ మహారాజా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట! విలన్ గా చేయడం రవితేజకు కొత్త విషయం కాదు. విలన్ పాత్రలతోనే రవితేజ కెరీర్ మొదలైంది. తొలినాళ్లలో చాలా సినిమాల్లో నెగిటీవ్ కేరక్టర్లు చేశాడు రవి. మళ్లీ ఇన్నాళ్లకు రాజమౌళి పుణ్యమా అని విలన్ అవతారం ఎత్తనున్నాడన్నమాట. బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఎన్టీయార్, చరణ్ అన్నదమ్ములుగా ..బాక్సర్లుగా కనిపిస్తారు. రవితేజ ఇందులో విలన్ గా చేయడం నిజమే అయితే.. ఆ పాత్రను దర్శకధీరుడు ఎలా డిజైన్ చేశాడో..

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరకుంటున్నానని చెప్పారు.. హైదరాబాద్‌ ఎన్ టిఆర్ ట్రస్ట్ భవన్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.. డప్పుకొట్టి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు..

కాన్సరు వ్యాధి నిర్ధారణకు.. భౌతిక శరీరపరీక్ష, వ్యాధి సంబంధిత పరీక్షలు జరపాలి. ఎండోస్కోపీ, లారింగోస్కోపీ, బ్రోంకోస్కోపీ, కోలోస్కోపే పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటితో పాటు ఎక్స్‌-రే, అల్ట్రా సౌండ్‌, సిటీస్కాన్‌, మామోగ్రఫీ, రక్త సంబంధ, జీవ రసాయనశాస్త్ర పరీక్షలు, ఎముక స్కాన్‌, ఎముకల అధ్యయనం చేస్తారు. కాన్సరు దశలను నిర్ణయించి దానిని నయం చేయడానికి విధానాలను రూపొందించుకోవాలి. కాన్సరు దశను నిర్ణయించుకోవటంవల్ల జబ్బు ఏ దశలో వుంది? దాని పెరుగుదల ఎలా వుంటుంది? వ్యాధిని నయం చేయడానికి ఏ విధానాలను రూపొందిచాలి. చికిత్సకు ఎటువంటి ఫలితం వుంటుందనే విషయాలు తెలుస్తాయి.

22/09/2016: బెంగళూరు: సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా కావేరి జలాలను తమిళనాడుకు వదలడంపై కర్ణాటక తాత్సారం చేస్తోంది. నీటి విడుదలను మరో 2 రోజులపాటు వాయిదా వేసింది. ఈ విషయంపై చర్చించడానికి ఈ నెల 23న గవర్నరు అనుమతితో ఉభయ సభలను సమావేశ పరచాలని బుధవారం జరిగిన అఖిలపక్ష, మంత్రివర్గ భేటీల్లో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 23వరకు నీటిని వదలబోమని సీఎం సిద్ధరామయ్య బుధవారం చెప్పారు. ఈ నిర్ణయాన్ని మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. కావేరీ జలాలను బుధవారం నుంచి ఈ నెల 27వరకు రోజూ 6 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని సుప్రీం మంగళవారం ఆదేశించడం తెలిసిందే. దీంతో.. కర్ణాటక సర్కారు బుధవారమంతా చర్చలు జరిపి పై నిర్ణయానికి వచ్చింది. రాత్రి మంత్రివర్గ సమావేశం నిర్వహించి బాగా పొద్దుపోయాక సిద్ధరామయ్య వివరాలను మీడియాకు చెప్పారు. అఖిలపక్ష భేటీకి బీజేపీ గైర్హాజరైంది. మరోవైపు రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలుజగదీష్‌శెట్టర్, సదానందగౌడ తదితరులు ప్రధాని నరేంద్ర మోదీని కలసి కావేరి విషయంలో కలుగజేసుకోవాలని కోరగా ఆయన నిరాకరించినట్లు సమాచారం.

 మనశరీరములో వివిధ భాగాలు నిర్ధిష్ట స్థానాలలో స్థిరముగా ఉండేలా చూసేవి కండరాలు . గజ్జల్లో కాని, ఉదరంలో కాని కండరాలు బలహీనపడినప్పుడు, కడుపు లోని కొవ్వు, ప్రేగులు వాటిగుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు బయటికి కనబడే “ఉబ్బు”ను గిలక లేదా హెర్నియా (Hernia) అంటాము. కారు లేదా బైక్‌ టైర్‌ పంచర్‌ అయినప్పుడు లేదా దెబ్బ తిన్నప్పుడు ట్యూబ్‌ ఆ ప్రాంతంలో ఉబికి వచ్చినట్లుగా ఉంటుం ది. హెర్నియాలో ఇలాగే జరుగుతుంది. ఏ వయస్సు వారికై నా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్న వారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. అలాంటపుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మొదట్లో నొప్పి ఉన్నట్లు అనిపించక పోయినా ఆ తర్వాత సమస్య మరింత జటిలమవుతుంది. ఈ విషయాన్ని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించాలి.

ఒక గ్లాస్ తాజా సంత్ర పండ్ల రసాన్ని తీసుకొని, మరియు దీనికి కాల్చిన జీలకర్రని కలపండి. ఈ మిశ్రమాన్ని మొదట అసిడిటీ వచ్చినపుడు తాగండి మీరు త్వరగా ఉపశమనాన్ని పొందుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు ఈ మిశ్రమాన్ని వరుసగా వారం రోజుల పాటు తాగండి.

ఊపిరితిత్తులు రెండూ గొంతు దిగువ భాగాన ఛాతీ కుహరంలో ఒకదాని పక్కన మరొటి ఉంటాయి. ఈ రెండింటి మధ్య భాగంలో ఉండే ఖాళీ స్థలాన్ని మీడియస్టినమ్‌ అంటారు.. మీడియాస్టినమ్‌ మధ్య భాగంంలో గుండె, దాని నుంచి వచ్చే రక్తనాళాలు ఉంటాయి. ఒక్కొక్క ఊపిరితిత్తిని ఒక్కొక్క పొర ఆవరించి ఉంటుంది. ఊపిరితిత్తికి అతుక్కొని ఉండే పొరను విస్రల్‌ఫ్లూరా అంటారు. దాని పైభాగంలో ఉండే పొరని పెరైటల్‌ప్లూరా అంటారు. ఈ రెండు పొరల మధ్య ఉండే స్థలాన్ని ప్లూరల కేవిటీ అంటారు.

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సాహో’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ లుక్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో ప్రభాస్‌ బ్లాక్‌ కోట్‌ ధరించి ఒక చెయ్యి పాకెట్‌లో మరో చేతిలో ఫోన్‌…

14/06/2016: ముఖ్యమంత్రి జయలలిత నేడు (మంగళవారం) ఢిల్లీ పయనం అవుతున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతున్నారు. ఒక సీఎం పీఎంను కలవడం సాధారణ విషయమే కదా అని తీసిపారేయకండి. ఈ పర్యటన రాజకీయంగా ఎంతో కీలకమైనదనే ప్రచారం జరుగుతోంది. ఎన్‌డీఏ కూటమిలో ఏడీఎంకే చేరేందుకు రంగం సిద్ధమైందనే సమాచారం హల్‌చల్ చేస్తోంది. చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకోగా జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి అధికారం చేపట్టిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి ప్రధానిని మర్యాద పూర్వకంగా కలవడం సహజం. పనిలో పనిగా రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతి పత్రం సమర్పిస్తారు. ఈ కోవలో ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఢిల్లీలో ప్రధానిని కలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం ఆశిస్తున్న సహకారంపై తన వెంట వినతిపత్రాన్ని కూడా పట్టుకెళుతున్నారు. కేరళ, కర్ణాటకల నుంచి వాటా జలాల సమస్యను ప్రధానితో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఇదిలా ఉండగా ఎన్‌డీఏ కూటమిలో ఏడీఎంకే చేరాలని భారతీయ జనతా పార్టీ ఎన్నో ఎంతగానో కోరుతోంది. లోక్‌సభలో ఎన్‌డీఏకు సంపూర్ణమైన బలం ఉన్నా, రాజ్యసభలో బలహీనంగా ఉంది. ఈ సమస్య అనేక బిల్లుల ఆమోదానికి అవరోధంగా మారింది. అన్నాడీఎంకేకు లోక్‌సభ, రాజ్యసభలను కలుపుకుని 50 స్థానా లు ఉన్నాయి. ఎన్‌డీఏకు ఏడీఎంకే బలం తోడైతే కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టే అనేక బిల్లులు సునాయాసంగా ఆమోదం పొందగలవని బీజేపీ ఆశపడుతోంది. ఎన్‌డీఏలో చేరకున్నా బీజేపీకి విశ్వసనీయమైన స్నేహితునిగా ఏడీఎంకే వ్యవహరిస్తోంది. అందుకే ఎన్‌డీఏకు ఎదురవుతున్న అనేక సమస్యలపై ఉభయ సభల్లో లోపల వెలుపల కూడా అన్నాడీఎంకే అండగా నిలుస్తోంది. జీఎస్‌టీ బిల్లు మినహా అన్నింటా అమ్మ భరోసా ఇచ్చింది. ఈ పరిస్థితిలో ఎన్‌డీఏలో చేరడం ద్వారా ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలని, బీజేపీ పథకాలను అడ్డుకునేందుకు కాచుక్కూచున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే అన్నాడీఎంకేను చేర్చుకోవడం వల్లనే సాధ్యమని బీజేపీ అధిష్టానం నమ్ముతోంది. అంతేగాక ఎన్‌డీఏ మిత్రపక్షాలైన శివసేన, తెలుగుదేశం పార్టీలను అంతగా నమ్ముకోలేమని కూడా భావిస్తోంది. ఈ పరిస్థితిలో ఎన్‌డీఏలో ఏడీఎంకే చేరినట్లయితే భారత్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ధైర్యంగా ముందుకు సాగవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2014 మోదీ ప్రధాని కాగానే జయలలిత ఢిల్లీ వెళ్లి అభినందించి వచ్చారు. ఇటీవల జయలలిత కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జయలలితను ఢిల్లీలో మోదీ అభినందించనున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత ఢిల్లీలో తనను కలిసినపుడు ఎన్‌డీఏలో చేరాల్సిందిగా మోదీనే నేరుగా కోరడమే కాదు ఒత్తిడి చేసే అవకాశం ఉందని, జయ సైతం నిరాకరించక పోవచ్చని విశ్వసనీయ సమాచారం. నేడు ఢిల్లీకి సీఎం జయలలిత ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఢిల్లీకి చేరుకోగానే నేరుగా తమిళనాడు భవన్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. సుమారు గంటసేపు వీరిద్దరూ సంభాషించుకునేలా ఏర్పాట్లు చేశారు. కావేరీ జలాలు, ముల్లైపెరియార్, తమిళ జాలర్లపై శ్రీలంక గస్తీ దళాల దాడులు, కచ్చదీవుల సమస్యలను ప్రధాని వద్ద ప్రస్తావిస్తారు. అలాగే కొత్త విద్యుత్ పథకాలు, మెట్రోరైల్ విస్తరణ పనులకు అవసరమైన నిధులు, రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయడం తదితర అంశాలు కూడా వీరిద్దరి చర్చల్లో ప్రస్తావిస్తారని సమాచారం. సీఎంతో పాటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర
్శి రామమోహన్‌రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి తదితరులు వెళుతున్నారు. ప్రధానితో భేటీ ముగిసిన తరువాత సాయంత్రమే సీఎం తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది.

ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా జుట్టు ఉండదు. కొందరి జుట్టు సిల్కీగా ఉంటే, మరికొందరికి ఉంగరాలు జుట్టు, చిక్కుముడిగా, జిడ్డుగా ఉండే జుట్టు ఉంటుంది. జిడ్డుగా ఉన్నంత మాత్రాన ప్రతి రోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. అలాగే తలస్నానం చేసిన తర్వాత కండీషనర్ తో జుట్టు బాగా ఆరేలా చూసుకోవాలి.

మెడ నిలపటం, పాకటం, తప్పటడుగులు, అత్తతాతలు.. పిల్లల ఎదుగుదల క్రమంలో ప్రతిదీ ఒక పండగే. వీటిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు తల్లిదండ్రులు తేలికగానే గుర్తుపడతారు.. వెంటనే దృష్టిసారిస్తారు కూడా. కానీ ఈ గడపలన్నీ దాటి.. ప్రయాణం బాగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. వీటిని గుర్తించటం అంత తేలిక కాదు. వాటిని పట్టుకోవటానికి కాస్త అవగాహన అవసరం. ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనదీ.. ఇప్పటి వరకూ పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ… సంపన్న వర్గాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ.. మన దేశంలోనూ, అన్ని వర్గాల్లోనూ ఎక్కువేనని ఇప్పుడిప్పుడే స్పష్టంగా బయటపడుతున్నదీ… ఆటిజం!

ఆ తర్వాత మా ఎప్పుడో ఒక సారి రాములు హెచ్ ఎం టీవీ లో కలిసాడు. అప్పటికే సాంబశివుడు ను దుండగులు ఘోరంగా చంపారు. తను టీ ఆర్ ఎస్ లో చేరినట్లు, ప్రాణ భయం అలాగే ఉన్నట్లు చెప్పాడు. మళ్ళీ… ఈ రోజు ఉదయం టీవీ ల ద్వారా తెలిసింది… రాములు నల్గొండ లో హత్యకు గురయ్యాడని. లొంగి పోయాక రాములు ఏమి చేసాడో, ఎలా గడిపాడో తెలియదు కానీ… చాలా మందిలో లేని దేశభక్తి రాములు కు ఉందని అప్పట్లో తన మాటల ద్వారా నాకు అర్థమయ్యింది. ఏదో ఒక రోజు ఘోరంగా హత్యకు గురవుతాడని రాములు కే కాదు, మా అందరికీ తెలుసు. 

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరాల కంటపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ప్రారంభోత్స కార్యక్రమంలో షాట్ కోసం రెడీ అవుతున్న బాలయ్య అసిస్టెంట్ ను తల మీద కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు. బాలకృష్ణ దర్శకుడు కేయస్ రవికుమార్ తో మాట్లాడుతుండగా అసిస్టెంట్ షూ విప్పటం వీడియోల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పైసా వసూల్ షూటింగ్ పూర్తి చేసిన బాలయ్య తన 102వ సినిమాగా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఫేం చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

మోడీ మంత్రివర్గ విస్తరణలో పది రాష్ట్రాలకు మాత్రమే బెర్తులు దొరికాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు మంత్రివర్గంలో ప్రాముఖ్యత ఇచ్చారు. కొత్తగా ప్రమాణం చేసినవారిలో ఎక్కువ మంది యూపీకి చెందినవాళ్లే ఉన్నారు. ఇక గుజరాత్ నుంచి కొత్తగా ముగ్గురికి మంత్రివర్గంలో చోటు లభించింది. కులాల వారీగా తీసుకుంటే అత్యధికంగా ఓబీసీలకు స్థానం లభించగా.. తర్వాత ఐదుగురు దళితులకు మంత్రి పదవులు లభించాయి. రెండు బెర్తులు మైనార్టీలకు కేటాయించారు. ఈ సారి విస్తరణలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించారు.

చెట్టుపైన పండి పోయిన మఱ్ఱి ఆకులు పసుపు పచ్చగా వుంటాయి … వాటిని సేకరించి మట్టి మూకుడులో వుంచి మంట పైన పెట్టండి, ముందుగా ఆకులు మాడిపోయి నల్ల బూడిద గా మారుతుంది అలాగే కలుపుతూ వుంటే ఆ బూడిద తెల్లటి భస్మంగా మారుతుంది ఈ భస్మాన్ని సేకరించి గాజు సీసా లో నిలువ చేయండి ఉదయం పరగడుపున మరియు రాత్రి బోజనానికి అరగంట ముందు ఒక గ్రాము చొప్పున స్వచ్చమైన తేనెతో కలిపి తీసుకోండి ఇలా వంద రోజులు క్రమం తప్పకుండా తీసుకోండి అన్ని రకాల అలర్జీలు మీకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతాయి ఈ చిట్కా ఏ ఆయుర్వేద గ్రంధాలలో కనిపించదు మా పెద్దలు అనుభవపూర్వకంగా మాకు పంచినది దీనికి ఏ విధమయిన పత్యం అవసరం లేదు అందరు ఆచరించవచ్చు ఎలాంటి దుష్ప్రభావాలు వుండవు అందరికి ధన్వంతరీ కృప వల్ల ఆరోగ్యమస్తు

కాళ్ళు, చేతులు, చీలమండల దగ్గర వాపు ఉన్నట్లైతే అది శ్వాసకోశ వ్యాధి కి చిహ్నంగా చెప్ప వచ్చును. హృదయరోగములతో ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు తోడైనప్పుడు వాపు అనేది విలక్షణంగా కనిపిస్తుంది. చాలా సార్లు గుండె, ఊపిరితిత్తులు ఒకే రకమైన లక్షణాలను కనపరుస్తాయి. ఎందుకంటే చాలా రకాలైన వ్యాధులకు ఈ రెండు అవయవాలు ప్రభావితమౌతాయి.

‘రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో వీసీ అప్పారావుకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎన్ హెచ్ ఆర్ టీమ్ ఇంకా రిపోర్టు కూడా ఇవ్వలేదు. అతనికి ఇంకా బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎవిడెన్స్ ప్రభావితం చేపి పొజిషన్ లో ఉన్నాడు. ఎవిడెన్స్ ఎలా టాంపర్ చేస్తాడో కోర్టు కూడా తెలుసు.  

బి-కాంప్లెక్స్‌ మిటమిన్స్‌, కెఫీన్‌, అమినో ఆమ్లాలు (టారిన్‌ వంటివి), కార్నిటిన్‌, ఇనోసిటాల్‌, గ్లూకురొనోలాక్టోన్‌, హెర్బల్‌ సప్లిమెంట్స్‌, గ్లూకోజ్‌ మొదలైనవి ఈ ఎనర్జి డ్రింక్స్‌లో ఉంటాయి. కొన్ని డ్రింక్స్‌లో జిన్సెంగ్‌ లాంటి ఉత్తేజకర పదార్థాలు కూడా ఉంటున్నాయి.

మేలిగంట్‌ మెలనోమా అను క్యాన్సర్‌. అమెరికాలో స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో ఆరోస్థానాన్ని, పురుషులలో వచ్చే క్యాన్సర్లలో ఐదవ స్థానాన్ని సంపాదించినది. చర్మానికి వచ్చే క్యాన్సర్లలో 4 శాతం ఈ మాలిగెంట్‌ మెలనోమా వల్ల వస్తుంది. మరియు 80 శాతం మంది దీని వల్ల చనిపోతారు. మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని జాతుల వారిలో ఈ వ్యాధి వస్తున్నా, నల్లజాతి వారికన్నా 17 నుండి 25 రెట్లు తెల్లజాతి వారిలో ఎక్కువ కనిపించవచ్చును.

18/10/2016: లోని: పేరుమోసిన రాజకీయ నాయకుడి తమ్ముడొకడు మైనర్ల పట్ల పాశవికంగా ప్రవర్తించాడు. ముగ్గురినీ కొట్టంలో బంధించి, బర్రెలకు వాడే సిరంజిలతో మర్మాయవాల్లోకి పెట్రోల్ ను ఇంజెక్ట్ చేశాడు. వాట్పప్ ప్రచారంతో వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా లోని పట్టణ మాజీ అధ్యక్షుడు, సమాజ్ వాది పార్టీకి చెందిన హజి ఎహసాన్ షురేషీకి స్థానికంగా పెద్ద సంఖ్యలో పశువుల దొడ్లు ఉన్నాయి. అతని తమ్ముడు రిజ్వాన్ ఖురేషి వాటిని నిర్వహిస్తూఉంటాడు. కొద్ది రోజుల కిందట రిజ్వాన్ ఖరీదైన మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. ఈ ఘటన జరిగిన సమయంలో గొడ్ల కొట్టం సమీపంలో తచ్చాడుతూ కనిపించిన తొమ్మిది మందిని రిజ్వాన్, అతని అనుచరులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురిపై(16, 17 ఏళ్ల మైనర్లు ఇద్దరు, 24 ఏళ్ల మరో యువకుడు) అనుమానం బలపడటంతో చిత్రహింసలకు హింసలకు గురిచేశారు. మొబైల్ దొంగతనాన్ని ఒప్పుకోవాలంటూ వాళ్ల మలద్వారం గుండా పెట్రోల్ ను ఇంజెక్ట్ చేశారు. బర్రెలకు వినియోగించే సిరంజిలతో సున్నితమైన భాగంలో పెట్రోల్ ఎక్కించడంతో ఆ ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఒకరి బంధువు ఈ ఘాతుకాన్ని వాట్సప్ ద్వారా వెలుగులోకి తెచ్చాడు. లోని ప్రాంతమంతా దీనికి సంబంధించిన వీడియోలు షేర్ అయ్యాయి. అలా సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తీవ్ర గాయాలతో ఢిల్లీలోని ఆసుపత్రిలో మైనర్లిద్దరూ చికిత్స పొందుతుండగా, మరో యువకుడు లోనిలోని ఆసుపత్రిలో చేరాడు. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పెట్రోల్ ప్రభావం వల్ల మలద్వారం వద్ద శాశ్వత సమస్యలు ఏర్పడతాయని డాక్టర్లు చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు రిజ్వాన్ ఖురేషిని అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని రిజ్వాన్ అన్న హజీ ఎహసాన్ ఖురేషీ ఆరోపిస్తున్నారు. మొబైల్ పొయిన తర్వాత తమ్ముడు(రిజ్వాన్) ఆ ముగ్గురినీ పిలిపించింది వాస్తవమే, చెప్పదెబ్బో, బెత్తంతోనో కొట్టి ఉండొచ్చు తప్ప పెట్రోల్ ఇంజెక్ట్ చేయలేదు. మొబైల్ దొంగిలించినట్లు ఒప్పుకున్న తర్వాత ఆ ముగ్గురిని విడిచిపెట్టారు. ఇది జరిగిన తర్వాతి రోజు ప్రతిపక్షాలు కలుగజేసుకుని కావాలని విషయాన్ని పెద్దది చేశాయని ఎహసాన్ అంటున్నారు.

* బిందీ: కుంకుమ, తిలకం వంటి వాటిలో ‘ఫ్లోర్‌సిన్‌ డై’లు వాడతారు.ఇవి సూర్యరశ్మితో చర్య జరిపి.. ముందు నల్లటి మచ్చలు, కొంత కాలానికి బొల్లిలా తెల్లటి మచ్చలు వస్తాయి. కాబట్టి తేడాగా అనిపిస్తే వెంటనే బొట్టు మార్చాలి. ఆ ప్రదేశంలో చర్మం మీద జింక్‌ ఆక్సైడ్‌ వంటి క్రీములు మందంగా రాసుకుని, దాని మీద నల్లతిలకం వంటివి పెట్టుకోవచ్చు. లేదంటే విభూతి వంటివి దట్టంగా పెట్టుకుని, దాని మీద చిన్న బొట్టు పెట్టుకుని చూడొచ్చు. స్టిక్కర్ల వెనక ఉండే జిగురు కారణంగా ‘కాంటాక్ట్‌ అలర్జీ’లూ ఎక్కువే.

అయితే ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటి అంటే కెమికల్స్ కలిగి ఉన్న షాంపూలు వాడటం వలన జుట్టు యోక్క సారాన్ని కోల్పోతుంది అంతేకాదు జుట్టు డ్రై అయిపోతుంది..అందుకే సహజసిద్ధమైన షాంపులు వాడటం ఎంతో ఉత్తమం..చాలా మంది జుట్టుకి ఎలక్ట్రానిక్ పరికరాలకి సంభందించిన అనేక పరికరాలు వాడుతూ ఉంటారు హెయిర్ డ్రై లాంటివి అస్సలు ఇలాంటివి వాడటం జుట్టు ఎదుగుదలని ఆపేస్తుంది అని అంటున్నారు ..

‘కబాలి’ చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె పాత్ర పోషించిన నటి ధన్సిక. ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రం ‘వాలుజడ’. నివిన్‌ పౌలీ కథానాయకుడు. రమణ మల్లం దర్శకుడు…

జట్టుకు కాలుష్యమే ప్రధాన శత్రువు. దీనివల్ల తెల్లబడటం, రాలిపోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. బీ వెంట్రుకలు అసాధారణ స్థాయిలో రాలిపోవడం వల్ల బట్టతల కూడా వచ్చేస్తుంటుంది. బీ ఇలాంటి కేసులు నగరంలో కాలుష్యం అధికంగా ఉన్న పాతనగరం, బీచ్‌రోడ్డు, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల నుంచి వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

28/09/2016: వాషింగ్టన్ : వరుసపెట్టి అణ్వాయుధాలను పరీక్షిస్తూ.. పంటికింద రాయిలా మారిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కాస్త భయం నేర్పించాలని అమెరికా భావిస్తోంది. దాంతో దక్షిణ కొరియాలో వెంటనే థాడ్ యాంటీ మిసైల్ వ్యవస్థను మోహరించాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా వాటిని అక్కడ ఏర్పాటుచేస్తామని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డేనియల్ రసెల్ తెలిపారు. యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలతో ఈ విషయమై అమెరికా సంప్రదింపులు మొదలుపెట్టింది. అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించకుండా ఉత్తర కొరియాను అడ్డుకోవాలని వివిధ దేశాలను కోరింది. ఉత్తరకొరియా క్షిపణిపరీక్షల నేపథ్యంలో తాము తప్పనిసరిగా వీలైనంత త్వరలోనే క్షిపణి విధ్వంసక వ్యవస్థను దక్షిణ కొరియాలో ఏర్పాటుచేస్తామని రసెల్ అన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఐదోసారి అణుపరీక్ష నిర్వహించిన తర్వాత ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తామని ఐక్యరాజ్య సమితి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే థాడ్ వ్యవస్థ గురించిన ఆలోచన అమెరికాకు వచ్చింది. ఉత్తరకొరియాపై ఆంక్షల విధింపునకు గట్టి మద్దతు ఇచ్చిన చైనా మాత్రం.. థాడ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ ఏర్పాటుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఉత్తరకొరియా అణ్వస్త్ర కార్యక్రమాల గురించి చైనా కూడా ఆందోళన వ్యక్తం చేసిందని, అందువల్ల ఆ దేశంపై ఆంక్షలకు తమ మద్దతు కూడా ఉంటుందని చెప్పిందని రసెల్ అన్నారు. అమెరికా, దాని మద్దతుదారులు జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు కలిసి ఉత్తరకొరియా ఆదాయ మార్గాలను కత్తిరించే ప్రయత్నాల్లో పడ్డాయి.

నల్లగొండ : జిల్లాలోని యాదగిరిగుట్ట  మండలంలోని గౌరాయిపల్లిలో చిరుత కలకలం నెలకొంది. నిన్న రాత్రి గ్రామంలో చిరుత సంచరించిన ఆనవాళ్లు ఉండడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామస్తుల సమాచారంతో.. అటవీశాఖ అధికారులు గ్రామంలో పర్యటించారు. ఆనవాళ్లను పరిశీలించి.. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే.. వెంటనే అధికారులు చిరుత పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

హోమియోపతి వైద్యంలో అన్ని రకాల అసిడిటీ వ్యాధులను సమర్థవంతంగా నయం చేయవచ్చు. శారీరకంగా, మానసికంగా, జన్యుపరంగా రోగిని వ్యక్తిగతీకరించిన తరువాత హోమియో మందులను ఇస్తారు. ఈవిధంగా ఇచ్చిన మందులు మూల స్థాయిలో పనిచేస్తాయి. అంతేకాకుండా ఆమ్ల స్థాయిని తగ్గించి, పిహెచ్ స్థాయిల సమతుల్యతను కాపాడి జీర్ణవ్యవస్థను యథాస్థితికి తీసుకువస్తాయి. కండర కవాటాన్ని దృఢపరుస్తాయి. జీర్ణవ్యవస్థ అన్ని రకాల ఆహార పదార్థాలను తట్టుకునేలా చేస్తాయని హోమియోపతి వైద్యులు చెప్తున్నారు. 

తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ జరిగింది. పెవిలియన్‌ గ్రౌండ్స్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. బస్‌ డిపో రోడ్‌, రామన్నపేట దానవాయగూడెం సాగింది. 14,15,16,24,31,32,34 డివిజన్లలో తమ్మినేని వీరభద్రం సుడిగాలి పర్యటన చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *