“జుట్టు నష్టం క్లినిక్ మోంక్టన్ జుట్టు పెరుగుదల డాక్టర్ చికాగో”

న్యూదిల్లీ: సోనియా గాంధీ కుటుంబానికి నరేంద్ర మోదీ రహస్యాలు అన్నీ తెలుసని.. అవే వారిపై ప్రధాని ఎటువంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ఆరోపించారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాను అరెస్టు చేసే ధైర్యంలేదని నిన్న జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేసిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గాంధీ ఫ్యామీలి దగ్గర మోదీ రహస్యాలు ఉన్నాయి.. అందుకే ఆయన చర్యలు తీసుకోవట్లేదని నేడు కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

ఒకవేళ మీకు మాయిశ్చరైజర్ ను ఉదయం సమయాల్లో రాయడం కుదరకపొయినా,లేదా ఇష్టం లేక పోయినా రాత్రుళ్ళు రాసుకోవడం మంచిది,దీనిని కొన్ని చుక్కలు చేతిలోకి తీసుకుని ముఖానికి,కాళ్ళు,చేతులకు పట్టిస్తే,అది మీ చర్మంలోకి చొచ్చుకుపోయి,మంచి ప్రబావాన్ని

ఈ మే నెలలో… సార్వత్రిక ఎన్నికల అనంతరం సంభవించిన ఒక రెండు పరిణామాలు నిశిత పరిశీలకులకు మనసు చివుక్కుమనిపిస్తాయి. నిజానికి ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయమైనా… ఇక్కడ పరిణామం అనే పదం వాడడానికి ఒక కారణం ఉంది. శక్తులైన ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య పలు పోలికలున్నాయి. అందివచ్చిన అధ్బుత అవకాశాలను చేతబుచ్చుకుని ఒక వెలుగు వెలిగి…. చరమాంకంలో వెక్కిరిస్తున్న అపజయాన్ని దిగమింగుకుని తలవంచుకుని వెళ్ళిపోతున్నారు.  

10/08/2016: న్యూఢిల్లీ: ‘అందంగా ఉంటుందని మాత్రమే కశ్మీర్ ను ప్రేమించకండి.. అక్కడి ప్రజల్ని, వాళ్ల పిల్లల్ని, ఆందోళనల్లో కళ్లు పోయినవారినికి కూడా ప్రేమను పంచండి’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు కశ్మీరీ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్. గడిచిన 32 రోజులుగా కశ్మీర్ లో అట్టుడుకుతున్న ఆందోళనలపై బుధవారం రాజ్యసభలో చర్చను ప్రారంభించిన ఆయన.. మిగతా భారతీయులలాగే కశ్మీరీలను సమదృష్టితో చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. (కశ్మీర్‌పై పెదవి విప్పిన ప్రధాని మోదీ) ’32 రోజుల తర్వాతైన కశ్మీర్ ఆందోళనలపై ఎట్టకేలకు చర్చను అంగీకరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాధాలు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమనే నిజం. కానీ అక్కడి ప్రజలతో మనం కలిసిపోయామా?లేదా? అని ఆలోచించుకోవాలి. దాదాపు ప్రతి కశ్మీరీ కుటుంబం ఉగ్రవాద పీడను అనుభవించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అత్యంత సున్నితంగా మారాయి. 32 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహావేశాలకు కారణం ఏదైనా కావచ్చు.. దాన్ని పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. కనీసం ఇప్పుడైనా కశ్మీరీలకు సంఘీభావం తెలపండి. అఖిలపక్షాన్ని పంపి, పరిస్థితులు చక్కబెట్టేందుకు చర్యలు తీసుకోండి. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఆపని చేస్తే.. కశ్మీరీలకు భరోసా ఇచ్చినవాళ్లం అవుతాం’అని గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీకి వినబడుతుందా? దళితులపై దాడులు, కశ్మీర్ సమస్యలపై ప్రభుత్వ స్పందన కోసం పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళనలు చేస్తోంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆ సమస్యలపై పార్లమెంట్ లో కాకుండా బయటి సభల్లో స్పందించడమేమిటని ఆజాద్ ప్రశ్నించారు. ‘తెలంగాణలో జరిగిన సమావేశంలో మీరు(ప్రధాని) దళితులపై దాడులను ఖండించారు. ఆ మాటలు పార్లమెంట్ వరకు వినబడలేదు. ఆ ప్రకటనేదో ఇక్కడి నుంచే చేస్తే సబబుగా ఉండేది’అని ఆజాద్ వ్యాఖ్యానించారు.

‘తాతగారు తెలుగు ప్రజల ఆస్తి.. ఆయన బయోపిక్‌లో బాబాయ్‌ నటిస్తే బ్రహ్మాండమే కదా’ అన్నారు యువ కథానాయకుడు ఎన్టీఆర్‌. ఓ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ఆయన వ్యాఖ్యాతగా ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు…….

* పాలీష్‌: చిక్కగా ఉండి, త్వరగా గట్టిపడటానికి పాలీష్‌లలో ‘ఫార్మాల్డిహైడ్‌’ తప్పనిసరిగా వాడతారు. దీనివల్ల కొన్నిసార్లు అసలుకే మోసం వచ్చి గోరు ఊడిపోయే ప్రమాదం ఉంది. గోరుచుట్లు, గోరుపైని చర్మం వాచి నొప్పి, చీముకూడా పట్టొచ్చు. గోరు రూపమే మారిపోవచ్చు. మందంగా అవ్వచ్చు, లేదా పల్చబడిపోవచ్చు. ఎప్పుడన్నా ఒకసారి పాలీష్‌ వేసుకుంటే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ వరసగా వేసుకుంటుంటే ఈ రసాయనాలు గోరులో పేరుకుపోయి.. కొంత కాలానికి సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.

ప్రధానంగా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు వాటిలో తరచుగా జరిగే జన్యుపరమైన మార్పుల వలన కొత్త తరహా వ్యాధులను కలిగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తాయి. వ్యాక్సిన్‌ల ద్వారా ఈ రకమైన వ్యాధులు ప్రబలకుండా చేసే అవకాశం ఉంది. కాని తరుచుగా జరిగే జన్యుమార్పుల వలన వచ్చే కొత్త వైరస్‌లకు వ్యాక్సిన్‌లను తయారు చేసి విడుదల చేసే నాటికి అవి మళ్లి కొత్త రూపు దాలుస్తున్నాయి.

విండీస్ కు వెళ్లిన వారిలో కోహ్లీ, రహానే, విజయ్, ధావన్, రాహుల్, పుజారా, రోహిత్ శర్మ, సాహా, అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, షమీ, భువనేశ్వర్, షార్దూల్ ఠాకూర్, స్టువర్ట్ బిన్నీలున్నారు.

బెంగళూరు : టీ -20 మ్యాచ్ లో భాగంగా టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది.టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శర్మ, ధావన్ లు ఆటను ఆరంభించారు. మూడో ఓవర్ ముగిసే సరికి భారత్ 18 పరుగులు చేసింది. శర్మ 8, ధావన్ 8 పరుగులతో ఆడారు. 5.6 ఓవర్ వద్ద శర్మ (18) వెనుదిరిగాడు. ప్రస్తుతం ధావన్ 22, కోహ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. 

ఈ వ్యాధి ఇతరులకు రాకుండా ఉండాలంటే దగ్గినప్పుడు మొహానికి అడ్డంగా రుమాలు ఉంచుకోవడం ఎంతైనా అవసరం. కొంతమందిలో గాలిలో ఉండే ఫంగస్‌ , ఆస్పర్జిల్లస్‌ , కాండిడా , పెన్సిల్లియమ్‌లు ఊపిరితిత్తు లోకి చేరి న్యూమోనియా , ఉబ్బసం , ఎక్స్‌ట్రిన్సిక్‌ ఎలెర్జిక్‌ అల్వియోలైటిస్‌ అనే వ్యాధులు కలుగచేస్తాయి. సాధరాణంగా వాడే యాంటిబయోటిక్స్‌ వలన న్యూమోనియా తగ్గినప్పుడు ఫంగస్‌ న్యూమోనియా ఉందేమోననే అనుమానం కలుగుతుంది. క్యాన్సర్‌ వ్యాధి ఉన్న వారిలోనే కాకుండా క్యాన్సర్‌ మందులు వాడుతున్న వారిలో కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి.

సక్షన్ అసోసియేటెడ్ లైపో (ఎస్‌ఏఎల్) : ఇది సాంప్రదాయికంగా చేసే లైపో. ఇందులో కొవ్వు ఉన్న చోట చిన్న గాటు పెట్టి దాని ద్వారా కొవ్వు ఉన్న చోటికి ఒక పైప్ (కాన్యులా)ను పంపుతారు. దాన్ని పీల్చేసే పరికరమైన వాక్యూమ్ డివైజ్‌కు కలుపుతారు. ఈ ప్రక్రియలో కొవ్వు ఉన్న చోటికి పైప్‌ను మ్యాన్యువల్‌గా కదిలిస్తూ కొవ్వును తొలగిస్తారు.

‘టచ్‌ చేసి చూడు’ చిత్రంలో తన నటన చూసి రవితేజ మెచ్చుకున్నారని అంటున్నారు రాశీ ఖన్నా. రవితేజ, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాకు విక్రమ్‌ సిరికొండ దర్శకత్వం వహించారు. సీరత్‌ కపూర్‌ రెండో కథానాయికగా నటించారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి రాశీ ఖన్నా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు.

వయసుకు తగినట్టుగా శరీరము మారుతుంది . అది సహజము . ఐతే కొందరి ముఖాలు వయసును తెలియనివ్వవు . వారి అసలు వయసుకన్నా ఐదారేళ్ళు చిన్నగా కనిపిస్తారు . వారి యవ్వన రహస్యము వారు క్రమము తప్పక తీసే నిద్రలో ఉంటుంది. నిద్ర వల్ల వచ్చే లాభాలు ఒకటి రెండు కాదు . సుఖనిద్రపోవడం ఒక వరము .

21/06/2016: న్యూఢిల్లీ : ఇది అచ్చం పాత తెలుగు సినిమా హీరోలకు ఉన్నలాంటి కథ. హీరో తల్లికి తీవ్రంగా జబ్బు చేస్తుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో తొలిసారి దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత పెద్ద గజదొంగగా మారుతాడు. ఢిల్లీలో కూడా ఒక యువకుడు నిజంగానే ఇలాంటి పరిస్థితిలోనే దొంగగా మారాడు. తన యజమానుల ఇంట్లోంచి ఏకంగా రూ. 90 లక్షల విలువైన సొత్తు చోరీ చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని బబ్రాల్ గ్రామంలో గల అతడి ఇంట్లో ఢిల్లీ పోలీసులు సోదాలు చేసినప్పుడు.. అతడు అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి పక్కనే కూర్చుని ఉన్నాడు. అతడిపక్కనే రూ. 90 లక్షల విలువైన బంగారు నగల బ్యాగ్ ఉంది. అతడి పేరు బ్రిజేష్. దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలో ఈనెల 8వ తేదీన తన యజమాని ఇంట్లోంచి 11 డైమండ్ నక్లెస్ లు, 8 డైమండ్ గాజులు, 24 బంగారు చెవిరింగులు, 20 ఉంగరాలు, రూ. 20వేల నగదు తీసుకుని పారిపోయాడు. 16వ తేదీన ఆ ఇంటి యజమానురాలు నమ్రతాకుమారి యూరప్ నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో నగలు లేని విషయాన్ని గుర్తించి పోలీసులకు బ్రిజేష్ మీద అనుమానంతో ఫిర్యాదుచేశారు. గతంలో ఇంట్లో పనిచేసిన అతడిని, అతడి పనితీరు నచ్చక ఆమె తీసేశారు. కానీ, ఆమె దేశంలో లేని సమయంలో జూన్ 7 నుంచి 9 వరకు అతడు అక్కడే పనిచేసినట్లు తెలిసింది. దాంతో అతడిమీదే అనుమానం వచ్చింది. సరిగ్గా అతడి తల్లి అనారోగ్యం బారిన పడిన సమయంలోనే ఉద్యోగం కూడా పోయింది. దాంతో డబ్బులు బాగా అవసరమై, తప్పనిసరి పరిస్థితుల్లో అతడు దొంగగా మారాడు. చాలా ఏళ్ల క్రితమే తండ్రి చనిపోవడం, ఇద్దరు తమ్ముళ్లను పెంచే బాధ్యత కూడా అతడిమీదే ఉండటంతో 2015లో ఢిల్లీకి వచ్చి ఇళ్లలో పనిచేయడం మొదలుపెట్టాడు. చివరకు ఇలా దొంగగా మిగిలాడు.

ముంబయిలో మిస్సయిన అమ్మాయిని వెతకడం… అందునా సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ పెట్టి ఉంటే వెతకడం ఎంత కష్టమో ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌కి తెలుసు. ఫ్రెండ్స్‌ కూడా వెతికారు రాత్రంతా. ఇంట్లోనే శవమై ఉంటుందని ఎవరూ ఊహించలేదు.చూస్తే దోపిడీ దొంగలు చేసిన హత్యలా లేదు. ఇంట్లో వస్తువులేవీ పోలేదు. తలుపు కూడా బలవంతంగా తీసుకుని వచ్చినట్టులేదు. ఎవడో తెలిసిన వాడే వస్తే హతురాలు స్వయంగా తలుపు తీసినట్టుంది. చంపడానికి మోటివ్‌ ఏమిటో అర్ధంకాలేదు. ఆమె సెల్‌ఫోన్‌ మాయం చేసేశాడు హంతకుడు. అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తుకి పెద్ద ప్రతిబంధకంగా మారింది.చుట్టుపక్కల భవన నిర్మాణ కార్మికుల్ని, ఇంటింటికీ వచ్చే సేల్స్‌మాన్‌లనీ, అపార్ట్‌మెంట్లో పనిమనుషుల్నీ రౌండప్‌ చేయమని ఆదేశించాడు సిబ్బందిని ప్రకాష్‌. ఈ రౌండప్‌లో అనుమానితులెవరూ తేలలేదు. కీలక సమాచారమూ లేదు. పోస్ట్‌మార్టం రిపోర్టులో లైంగిక దాడి జరగలేదని ఉంది. మరణానికి కారణం ఊపిరి ఆడకపోవడం. తాడుతో ఉరి బిగించి, అదే తాడుతో కాళ్ళూ చేతులూ కట్టేశాడు హంతకుడు.

హెయిర్ ఫాల్ స‌మ‌స్య ఉంటే నిజంగా ఎవ‌రికైనా చిరాకు వేస్తుంది. ఎక్కువ‌గా రాలిపోయే జుట్టును ర‌క్షించుకోవ‌డానికి చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తారు. షాంపూలు వాడుతారు. ఆయుర్వేదిక్ ఆయిల్స్‌ను రాస్తారు. ఇంకా కొంద‌రు మ‌రింత ముందుకు వెళ్లి డాక్ట‌ర్లను కూడా క‌లుస్తారు. అయిన‌ప్ప‌టికీ హెయిర్ ఫాల్ ఆగ‌క‌పోతే..? మ‌రింత ఎక్కువైతే..? అప్పుడు ఏమ‌వుతుంది..? అలాంటి స‌మ‌యాల్లో ఎవ‌రైనా ఏం చేస్తారో తెలియ‌దు కానీ.. ఆ యువ‌కుడు మాత్రం తీవ్ర డిప్రెష‌న్‌కు లోన‌య్యాడు. దీంతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

150 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న సాహో సినిమా వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఒకే సారి అన్నీ బాషలులోనూ విడుదల చేస్తున్నారు. సాహో షూటింగ్ జరుగుతున్నా ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఒక నిర్ణయానికి రాకపోవడం ప్రభాస్ అభిమానుల ఆందోళన పడుతున్నారు. ఈ సినిమా నేషనల్ లెవెల్లో విడుదలకాబోతుంది కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకుడు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. సెప్టెంబరు 3న ఈ చిత్రం ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆడియో పోస్టర్లను….

“సరిగ్గా అప్పడే మా ఇంట్లో పని వాళ్లు మా అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకున్నారు. అందుకు రెక్కీ కూడా నిర్వహించారు. డబ్బు కోసం వాళ్లు ఆ పని చేయబోయారు. వారు తమ పధకాన్ని అమలు చేసే వేళలో నాకీ విషయం తెలిసింది. వాళ్లను చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ.. ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం అనిపించింది. అదే సమయంలో నాకు ఎదురైన అనుభవంతో మహానది కథ రాశా. ఎప్పుడైతే నా కూతురి విషయంలో నాకు భయం కలిగిందో.. అదే విషయాన్ని అందరికి చెప్పాలనుకునే మహానది సినిమా తీశా. ఇప్పటివరకూ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడైతే నేను ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకున్నానో.. పెద్దవాళ్లు అయిన నా కూతుళ్లు కూడా అలాగే అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉంది. అందుకే చెబుతున్నా” అని మహానది కథ వెనుక అసలు కథను చెప్పుకొచ్చారు కమల్.

– డాక్టర్‌ వందన హెగ్డే,-M.S., (OBG)F.R.M., (infertility)-స్పెషలిస్టు ఇన్‌ రిప్రొడక్టివ్‌మెడిసిన్‌, అబ్‌స్ట్రెట్రిషియన్‌ – గైనకాలజిస్టు, క్లినికల్‌డైరక్టర్‌, హెగ్డే హాస్పిటల్సు67/68, విఠల్‌రావు నగర్‌, మాధాపూర్‌-హైదరాబాద్‌ – 81 drvandanag@hotmail.com

ప.గోదావరి : పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ ఉదయం 10 గంటలకు లిఫ్ట్ మోటార్లను ఆన్ చేసి నీటి విడుదల ప్రారంభిస్తారు. అయితే పోలవరం కుడికాలువ పూర్తిగా సిద్ధం కాదందున తొలిరోజు కొన్ని పంపులను మాత్రమే రన్ చేయనున్నారు. అనంతరం సీఎం పోలవరం నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి ఖరీఫ్‌కు 80 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. 

7. ప్రాణాయామాలు, ధ్యానము నేర్చుకొని ప్రతి రోజూ ఎంత సేపు వీలైతే అంత సేపు చెయ్యటం శరీరానికే కాక మనసుకూ ఎంతో మంచిది. తగ్గుతుందన్న నమ్మకంతో చెయ్యండి. తగ్గాలనే కౄత నిశ్చయంతో చెయ్యండి. నిరాశకు అసలు చోటు ఇవ్వకండి.

ఢిల్లీ: రాజధాని రైతులకు క్యాపిటల్‌గెయిన్స్‌పై పన్ను మినహాయింపు ఇవ్వడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ను కలిసిన ఏపీ మంత్రులు కృజ్ఞతలు తెలిపారు. దాదాపు 60 మంది రైతులతోపాటు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేనిశ్రీనివాస్‌, ఎంపీ గల్లాజయ్‌దేవ్‌ తదితరులు వెంకయ్యను కలిశారు. మరోవైపు ఇవాళ కేంద్రం మంత్రి రాథామోన్‌సింగ్‌ను కలిసి రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్ట్‌లపై కూడా క్లీయరెన్స్‌ ఇప్పించాల్సిందిగా కోరతామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

చండీగఢ్‌: విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే జాట్‌ల రిజర్వేషన్‌ బిల్లును హరియాణా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. నిన్న హరియాణా మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని జాట్‌ వర్గీయులు తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించినా ఎటువంటి నిర్ణయమూ వెలువడకపోవడంతో తిరిగి ఆందోళనకు దిగుతామని ఉద్యమ నేతలు ఆదివారం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జాట్‌ రిజర్వేషన్‌ బిల్లుకి ఆ రాష్ట్ర కేబినెట్‌ సోమవారం ఆమోదం తెలిపింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. గత నెలలో జాట్‌ల ఆందోళనల వల్ల ఎన్నో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. తీవ్ర ఆస్తినష్టం జరిగింది. రైల్వేకి, స్థానిక వ్యాపారులకు నష్టం వాటిల్లింది. ఆందోళన సెగ దిల్లీకి కూడా తగిలింది. ఆందోళనకారులు దిల్లీకి నీటి సరఫరా చేసే కెనాల్‌ను మూసివేయడంతో రెండు రోజులపాటు నగరం నీటి ఎద్దడిని ఎదుర్కొంది.

లండన్‌ : లండన్ లో నిర్వహించిన వేలంలో పాప్‌సింగర్‌ ప్రిన్స్‌ దుస్తులు రికార్డు ధరను పలికాయి. 1984లో వచ్చిన ‘పర్పుల్‌రైన్‌’ మూవీలో ప్రిన్స్‌ ధరించి డ్రెస్‌లను వేలం వేశారు. ఒక్కొక్క డ్రెస్‌ 96వేల డాలర్ల ధరను పలికాయి. మొత్తం 1లక్షా92వేల డాలర్లు వచ్చినట్టు వేలం నిర్శాహకులు తెలిపారు. వైట్‌షర్ట్‌, లెదర్‌స్టీవ్స్‌, బ్లేజర్‌లను లక్షల డాలర్లుపోసి ఉత్సాహవంతులు సొంతం చేసుకున్నారు. డ్రెస్‌లతోపాటు ప్రిన్స్‌ ఉపయోగించిన గిటార్‌ కూడా వేలంలో ఏకంగా 1లక్షా 37వేల డాలర్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *