“జుట్టు నష్టం క్లినిక్ geelong +జుట్టు పెరుగుదల విటమిన్లు శాకాహారి”

రాజమండ్రి : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో అలజడి రేగడానికి ఆర్ఎస్ఎస్ కారణమని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయ సాధికారత బస్సు యాత్ర రాజమండ్రి నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి కట్టుబడి మతోన్మాధులను కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కన్నయ్య విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని జేడీ శీలం అభిప్రాయపడ్డారు. వీసీగా అప్పారావును తిరిగి తీసుకరావడం రగిలే పుండు మీద గాయం చేసే విధంగా ఉందన్నారు. విభజించి సమాజాంలో కలతలు సృష్టించే విధంగా ప్రయత్నిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. 

బెంగళూరు : రోడ్లు బాగు చేయండి..గుంతలు బాగా పడ్డాయి..ప్రమాదాలు జరుగుతున్నాయి..అధికారులు స్పందించండి. అంటూ ఎన్నో సార్లు విన్నవించుకున్నారు. కానీ అక్కడి అధికారులు పెడచెవిన పెట్టారు. విసిగి విసిగి వేసారిపోయిన ఆ స్థానికులు ఏం చేశారో తెలుసా ? దీని కోసం చదవండి..

అయితే కొత్త రాష్టమైన తెలంగాణకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రాష్టాల మాదిరిగానే తెలంగాణకు సైతం కేటాయింపులు ఉండటం పట్ల పెదవి విరిచింది. కొత్త రాష్టం..అందునా వెనకబడిన జిల్లాలున్న రాష్టమైనందున..కేంద్రం అదనపు నిధులు కేటాయిస్తుందని ఆశించింది. విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా పలు రాయితీలను సైతం ఆశించింది. ఇదే విషయాన్ని పలు మార్లు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రధాని మోడీ, ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లితో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట డిమాండ్లను వినిపించారు. ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భారీ సాగునీటి ప్రాజెక్టులకు ఆర్దిక సహకారం అందించాలని కోరారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో మాత్రం తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించ లేదు. అన్ని రాష్టాలను చూసిన విధంగానే తెలంగాణకు చూసారు తప్ప ఏలాంటి ప్రత్యేక తాయిలాలు ప్రకటించలేదు.

రాజమౌళి.. ఎన్టీఆర్‌.. రామ్‌చరణ్‌.. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మూడు పేర్లు హాట్‌టాపిక్‌. ఈ ముగ్గురూ కలిసి ఫొటో దిగగానే ఒకటే చర్చ. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకు వడివడిగా అడుగులు పడుతున్న సంగతి…

14/07/2016: న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ‘ఆప్’లో ఆమె ఉన్నత పదవి చేపడతారన్న ఊహగానాలు కూడా వినవస్తున్నాయి. ఈ వార్తలను ‘ఆప్’ నేతలు కొట్టిపారేశారు. వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని, ‘ఆప్’లో సునీత చేరకపోవచ్చని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కేజ్రీవాల్ తో కలిసి ఆమె ప్రచారం నిర్వహించే అవకాశం ఉందన్న వార్తలను తోసిపుచ్చలేదు. ‘ఆప్’ రాజ్యాంగం ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదు. పార్టీ ఉన్నత పదవుల్లోనూ ఒకే కుటుంబానికి ఇద్దరికి స్థానం ఉండదు. ఎన్నికలు జరగనున్న పంజాబ్, గోవాలో సునీతను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశముందని వచ్చిన వార్తలను ఆప్ నేతలు ఖండించారు. ప్రతిభ గల అభ్యర్థులను పార్టీ కార్యనిర్వాహక కమిటీ అంగీకారంతో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ సునీత వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. 1993 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన 51 ఏళ్ల సునీత ఆదాయపన్ను శాఖలో దాదాపు 22 ఏళ్ల పాటు పనిచేశారు.

ఇక నియామకానికి కట్‌ ఆఫ్‌ మార్కులు ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుందనే ఆశతో వేరే పరీక్షలకు సిద్ధం కావడం లేదు. ఫైనల్‌ రిజల్ట్స్‌ వస్తే వేరే పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉంది. తాజాగా మహిళలకు పోలీసుశాఖలో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇన్నాళ్లు సాధారణ రిజర్వేషన్‌కు అనుకూలంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. వీటిలో ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు త్వరగా నిర్ణయాలు తీసుకుంటే అనేకమంది అభ్యర్థులకు ఊరట లభిస్తుంది. ఇప్పటికైనా పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ఆసియా కప్‌కు ముందు సొంతగడ్డపై జరిగిన టీ 20 సిరీస్‌లో శ్రీలంక జట్టును 2-1తో ఓడించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రాణించాలని తహతహలాడుతోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంక జట్టు పరిస్థితి మాత్రం అయోమయంలో ఉంది. తిలకరత్నే దిల్షాన్‌, దినేష్‌ చాందిమల్‌, ఏంజెలో మాథ్యూస్‌,లసిత్ మలింగా, తిసెరా పెరీరా, నువాన్‌ కులశేఖర వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా…నిలకడలేమీతో ఇబ్బందిపడుతోంది. చమీర, శనాక, కులశేఖర, రంగనా హెరాత్‌లతో కూడిన బౌలింగ్‌ ఎటాక్‌ ఫర్వాలేదనిపిస్తున్నా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతోంది.

 హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకునే విషయంలో చంద్రబాబునాయుడు అనైతికంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరితే 10 నుంచి 11 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ఆయన ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయం భారీగా పెంచి.. కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న ముడుపులతోనే వైసిపి ఎమ్మెల్యేలను కొంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 

11/06/2016: సూర్యాపేట: గత రెండేళ్ల పాలనలో ప్రజా సమస్యల పరిష్కారంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో నిర్వహించిన ‘వికాస్‌ పర్వ్‌’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రజలతో నేరుగా ప్రధానిని దేశానికి అందించిన ఘనత భాజపాదేనని అమిత్‌ షా అన్నారు. గత ప్రభుత్వాలు అవినీతి, కుంభకోణాల రూపంలో రూ.12లక్షల కోట్లు కొల్లగొట్టాయని ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక అవినీతి, కుంభకోణాలు, లంచగొండితనం లేని దేశంలో మార్చగలిగామన్నారు. మోదీ పాలనను ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయని… అందువల్లే ఆయన ఎక్కడికి వెళ్లినా ఘనస్వాగతం లభిస్తోందన్నారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్‌ దేశానికి ఏం చేసిందో చెప్పాలని అమిత్‌షా డిమాండ్‌ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో ఆకాశం, నేల, సముద్రం అనే తేడా లేకుండా అన్నింటిపైనా కుంభకోణాలు చేశారని ఆరోపించారు. గత ప్రధాని ఎక్కడికి వెళ్లినా ప్రసంగం ఒకేలా ఉండేదని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కృషి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్‌షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం రూ.90వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే భాజపా లక్ష్యమన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని అమిత్‌ షా ఆరోపించారు. కుటుంబ పార్టీలతో అభివృద్ధి జరగదనే విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో 24 గంటల విద్యుత్‌ అందుతోందా?, ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించారా? ఆస్పత్రులు ఉన్నాయా? ప్రతి చేనుకు నీరు అందుతోందా? యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయా? అని ప్రశ్నించారు. భాజపా అధికారంలో ఉన్న ప్రతిచోట ఈ పనులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధి మోదీ నేతృత్వంలోని భాజపాతో సాధ్యమని అమిత్‌ షా పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం భాజపా బలోపేతం చేయాలని కోరారు.

ఆక్యూట్ ఫిషర్‌కు మందులను 3 నుంచి 4 వారాల పాటు వాడినా గుణం కనిపించని సందర్భాల్లోనూ లేదా యానల్ ఫిషర్ దీర్ఘకాలిక ఫిషర్ (క్రానిక్)గా రూపొందిన సమయాల్లోనూ శస్త్రచికిత్సను నిర్వహించాల్సి రావచ్చు. శస్త్రచికిత్స విధానాలివి…

ఫిట్‌నెస్ అంటే కేవలం కండలు పెంచడమే కాదు, ఫిట్‌నెస్ అనేది శరీరం మొత్తానికి సంబంధించినది. మన శరీరర పూర్తి ఫిట్‌గా ఉండాలంటే.. కార్డియో వ్యాయామాలు, బరువులు ఎత్తడాలు లాంటివి చెయ్యాలి. ఇంకా సిక్స్ ప్యాక్ గురించి అడిగారు, దీన్ని సాధించాలంటే.. కార్డియో వ్యాయామాలు తప్పనిసరి.

నిజానికి మనలో చాలామంది తమకు ఎటువంటి గుండె జబ్బూ లేదని అనేసుకుంటూ ఉంటారు. కానీ పైకి ఏమీ తెలియకుండానే గుండె జబ్బు ఉండే అవకాశమూ లేకపోలేదు. ఎలాంటి గుండె జబ్బు లక్షణాలు కనిపించకపోవటం, గుండెకు సంబంధించిన పరీక్షలేవీ చేయించుకోకపోవటం.. ఇలా భావిస్తుండటానికి కారణం కావొచ్చు. హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవటమనే రిస్కు ఆరోగ్యవంతులతో పోలిస్తే బీపీ ఉన్నవారిలో కొంచెం ఎక్కువుంటుంది. మధుమేహుల్లో ఇంకొంచెం ఎక్కువ. బీపీ, మధుమేహం రెండూ గలవారిలో అంతకన్నా అధికంగా ఉంటే పొగతాగేవారిలో.. ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో.. గుండెపోటు వచ్చి గుండె బలహీనమైన వారిలో.. గుండె వైఫల్యమైన వారిలో.. ఇలా క్రమంగా హఠాన్మరణం బారినపడే రిస్కు పెరుగుతుంటుందని మర్చిపోకూడదు.

18/07/2016: దిల్లీ: సీనియర్‌ భాజపా నేత, ఎంపీ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నేడు రాజ్యసభకు రాజీనామా చేశారు. సిద్ధూ రెండు నెలల క్రితమే నామినేటెడ్‌ ఎంపీగా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్‌ ఆమోదించారు. సిద్ధూ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను ప్రకటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మాజీ క్రికెటర్‌, గతంలో అమృత్‌సర్‌ లోక్‌సభ ఎంపీ అయిన సిద్ధూను 2014 లోక్‌సభ ఎన్నికల్లో అరుణ్‌ జైట్లీ కోసం అక్కడి నుంచి తప్పించారు. ఆ స్థానం నుంచి జైట్లీ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. సిద్ధూ 2004 నుంచి 2014 వరకు అమృత్‌సర్‌ ఎంపీ. ఆయన భార్య నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ కూడా భాజపా సీనియర్‌ నేత, పంజాబ్‌ అసెంబ్లీ ఎమ్మెల్యే.

కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న గాంధీజీని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకుందాం.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు…!

పరీక్షల సమయంలో పిల్లలపై మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనిని జయించాలంటే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. స్ట్రెస్‌గా అనిపించినప్పుడు కాసేపు నడవడం ఎంతో మంచిది. అలసటగా కనిపిస్తే.. ఐదు నిమిషాల పాటు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర ఎంతో ముఖ్యం. తప్పనిసరిగా రోజుకు ఆరుగంటల పాటు నిద్రపోవాలి. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టకుండా శ్రద్దగా కొద్ది సమయం చదివినా మంచి మార్కులు సాధించవచ్చు.

హెపటైటిస్‌-బి వైరప్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. దీన్ని ‘అక్యూట్‌’ దశ అంటారు. కామెర్లతో పాటు వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉండొచ్చు. ఈ దశలో మనం Elisa పరీక్ష చేస్తే ‘పాజిటివ్‌’ వస్తుంది. అంటే ఏదో మార్గంలో హెపటైటిస్‌ -బి వైరస్‌ వీరి శరీరంలో ప్రవేశించిందని, దాని కారణంగా కామెర్లు వచ్చాయని అర్థం. వీరికి ‘లివర్‌ ఫంక్షన్‌ టెస్లు’ల్లో కూడా కాస్త తేడాలుంటాయి.

* 2005లో దేవరకొండ పరిధిలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నించగా అక్కడి స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో తవ్వకాలను నిలిపివేశారు. 2006లో ‘యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున స్థానికులు ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి గిరిజన సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాయక్ మద్దతు తెలిపారు. పర్యావరణవేత్తలు, జన విజ్ఞాన వేదిక, పౌరహక్కుల సంఘం నాయకులు కూడా మద్దతిచ్చారు.

ఫేస్ బుక్ లో ఒక చోటి నుంచి ఈ పై బొమ్మ లేపెసాం. జోస్యం చెప్పడం, అంచనా వేయడం…లో భలే మజా ఉంటుంది. ఇప్పుడు మీడియా మీద, వ్యవస్థ మీద ఇంకా అసహ్యం పుట్టని వాళ్ళు, ప్రజాస్వామ్య హితైషులు, పొద్దుపోని వాళ్ళు లెక్కల మీద లెక్కలు కడుతున్నారు. ఇది ఆక్టోపస్ ల కాలం. దేని అంచనాలు దానివి. 

ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది. త్వరగా జీర్ణమవుతాయి. అధిక కొవ్వు నిల్వలు పేరుకోవు. బాగా నమిలి తినడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, మిఠాయిలను మితంగాతినడం వంటి జాగ్రత్తలను పాటించడం ఎంతయినా మంచిది.

6. దీనర్థం: వైరస్‌ దీర్ఘకాలం ఒంట్లో ఉండటం వల్ల లివర్‌ దెబ్బతినటం ఆరంభమైంది. వైరస్‌ వల్ల అది గట్టిబడిపోవటం మొదలైంది. కొద్దికొద్దిగా గట్టిబడుతున్న తొలి దశను పైబ్రోసిస్‌ అనీ, మరీ ముదిరిన తర్వాత దశను ‘సిర్రోసిస్‌’ అనీ అంటారు. దీనికి కూడా యాంటీ వైరల్‌ మందులు ఆరంభిస్తే లివర్‌ అస్థితి నుంచి మరింత దెబ్బతినకుండా ఉంటుంది. రక్తపువాంతుల వంటి సమస్యలకు కూడా చికిత్స చెయ్యొచ్చు. మొత్తం మీద ఇప్పుడున్న చికిత్సలతో – చాలాకాలం పాటు వీరి సాధారణ జీవితానికి సమస్యల్లేకుండా చూడొచ్చు.

సాధారణంగా మనం భోజనం చేసినపుడు అది ఆహారనాళం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఈ జీర్ణాశయానికీ ఆహారనా’ళానికీ మధ్య బిగుతైన కండర వలయం (స్పింక్టర్‌) ఉంటుంది. ఇది తలుపులా తెరచుకుంటూ జీర్ణాశయంలోకి ఆహారం వెళ్లేలా చేసి, వెంటనే మూసుకుపోతుంటుంది. దీనివల్ల తిన్న ఆహారం తిరిగి ఆహారనాళంలోకి రాకుండా జీర్ణాశయంలోని ఆమ్లాల్లోనే ఉండిపోయి, జీర్ణమవుతుంది. అయితే ఒకవేళ ఈ కండరవలయం పూర్తిగా మూసుకోకపోతే జీర్ణాశయంలోని ఆమ్లాలు పైకి ఎగదన్నుకు వస్తాయి. దీన్నే రిఫ్లక్స్‌ అంటారు. ఇవి ఆహారనాళం లోపలిగోడలను చికాకు పరచి, నొప్పితో కూడిన మంట రావటానికి కారణమవుతాయి. కిందికి వంగినపుడు, పడుకున్నప్పుడు ఈ మంట, బాధ మరింత ఎక్కువవుతాయి కూడా. టమోటా ఉత్పత్తులు, మద్యం, కాఫీతో పాటు పుల్లటి, మసాలా, కొవ్వు పదార్థాలు కూడా కండరవలయానికి ఇబ్బంది కలిగిస్తాయి. ఫలితంగా ఛాతీలో మంట సమస్య గలవారికి ఆ బాధ మరింత ఎక్కువవుతుంది. అధికబరువు, కడుపునిండా తినటం, నడుము వద్ద గట్టిగా పట్టి ఉంచే బిగుతైన దుస్తులు ధరించటం, పొగ తాగటం కూడా ఛాతీలో మంట ముప్పు పెరిగేలా చేస్తాయి. కాబట్టి మంట ఎక్కువ కావటానికి దోహదం చేస్తున్న అంశాలకు దూరంగా ఉండటంతో పాటు తగు చికిత్స తీసుకోవటం తప్పనిసరి. లేకపోతే ఇది మరింత ముదిరి, ఇతరత్రా సమస్యలకు దారితీయొచ్చు.

గాలిలో సూక్ష్మంగా ఉండే బ్యాక్టీరియా , వైరస్‌లతో పాటు ఫంగస్‌ , దుమ్ము , ధూళి , పుప్పొడి లాంటి పదార్థాలు ఉంటాయి. వీటికి తోడు పరిశ్రమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వివిధ రసాయన పదార్థాలు సల్ఫర్‌డై ఆకై్సడ్‌ , హైడ్రోజన్‌ సలె్పైడ్‌ , క్లోరిన్‌ , నైట్రికి ఆకై్సడ్‌ తదితరాలు ఉంటాయి. ఇలాంటి రసాయన పదార్థాలు పీల్చినప్పుడు దగ్గు , కఫం , పిల్లికూతలు , ఛాతీ పట్టేయడం జరుగుతుంది. కొందరిలో కెమికల్‌ నీమోనైటిస్‌ అనే సమస్య వస్తుంది. కొందరిలో వాతావరణ మార్పులు జరుగుతు న్నప్పుడు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి.

మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసుకోవడం, పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) విధానాలను పాటించాలి. మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్‌తో శుభ్రపరచుకునే వారు చాలా మృదువైన వాటిని ఉపయోగించడం మేలు.

మన శరీరంలో ముందుగా కొవ్వు చేరే భాగం పొట్ట కాబట్టి మీరు నార్మల్‌గా కనిపిస్తున్నా పొట్ట కనబడడానికి కారణం అదే అయి ఉండవచ్చు. ఆహారం విషయంలో కంట్రోల్‌గా ఉంటున్నానని రాశారు, మంచిదే. కానీ దానితో పాటుగా కొంచెం కార్డియో వ్యాయామాలు అంటే.. వాకింగ్, సైక్లింగ్ లాంటివి చేయండి.

25/07/2016: శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ ప్రజలతో కేంద్రం ఉద్విగ్న సంబంధాలను కోరుకుంటోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్‌లో పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకురావడానికి సహకరించాలని కశ్మీరీలను కోరారు. ఘర్షణల నేపథ్యంలో శ్రీనగర్, అనంతనాగ్‌లలో రెండు రోజులపాటు రాజ్‌నాథ్ పర్యటించారు. సీఎం మెహబూబా ముఫ్తీ, విపక్ష నేషనల్ కాన్ఫరెన్స్‌తో చర్చించారు. అనంతరం రాజ్‌నాథ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న పాక్ తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. సాధ్యమైనంత వరకు పెల్లెట్ గన్స్‌ను వాడకుండానే ఆందోళనకారులను నియంత్రించాలని భద్రతా దళాలను ఆదేశించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. కశ్మీర్ యువత ఆయుధాలు చేతబట్టేలా పాక్ పురిగొల్పుతోందని, దీన్ని విడనాడాలని సీఎం మెహబూబాఅన్నారు. కశ్మీర్ ఘర్షణల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు.

చిన్న పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించాడు అజయ్. సహాయక నటుడు నుంచి విలన్‌ వరకూ అన్ని పాత్రల్లో మెప్పించాడు. ‘విక్రమార్కుడు’లో క్రూరుడిగా, ఆర్య-2లో విలనిజంతో, ఇష్క్ లో నెగిటివ్‌, పాజిటివ్‌ ఉన్న పాత్రలను పండించిన ఆయన ‘సుబ్రహ్మణం ఫర్‌ సేల్‌’లో మాఫియా డాన్‌గా అలరించాడు. తాజాగా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ ’24’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇష్క్ లో ఆయన నటించిన పాత్రకు మెచ్చుకున్న దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఇందులో కీలక పాత్రను ఇచ్చారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు వస్తుందని అజయ్ తెలియజేస్తున్నాడు.

స్లీపింగ్ పాడ్ నుంచి బైటకు రాగానే బర్త్ డే విషెస్ చెప్తూ కొత్త వరల్డ్ ప్రెసిడెంట్ నుంచి ఒక మెసేజ్. ఉయ్ నీడ్ టు రీక్రియేట్ హ్యుమానిటీ, ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్స్ అని ప్రోత్సహిస్తుంటారు. నిజమే మరి. ఉన్న ఈ కొద్ది మంది హ్యూమన్స్ పోతే ఇక రోబోలు తప్ప భూమి మీద ఇంకా ఎవ్వరూ ఉండరు. అందుకోసమే సాటి హ్యూమన్స్‌తో మాట్లాడాలి అంటే కనీసం హాలోగ్రామ్ అయినా తప్పనిసరిగా వాడండి, అని ఆయన ఆదేశం.

కీ పెర్‌ఫామెన్స్ ఇండికేటర్స్, 15 సూత్రాల కుటుంబవికాసం, 10 అంశాలతో సమాజవికాసం, సుస్థిర వృద్ధి లక్ష్యాలు, వ్యవస్థీకృత మార్పులు, ఈ ప్రగతి అంశాలపై బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టామని సీఎం ప్రకటించారు.. స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్దత ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇంకా రైల్వేజోన్‌ ప్రకటనతో పాటు… రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు.కేంద్ర ప్రభుత్వ శాఖలు నేరుగా కేటాయించే నిధులపై అవగాహన పెంచుకోవాలని అధికారులకు సూచించారు.. సాధ్యమైనంత ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు..

ప్రయోజనాలు : చుట్టుపక్కల భాగాలకు హాని కలగకుండా మోడ్రన్‌ రేడియేషన్‌ థెరపీ అధిక మోతాదులో రేడియేధార్మిక కిరణాలను వెలువరిస్తుంది. దీని వల్ల వ్యాధి ముదరకుండా తక్కువ సమయంలో తొందరగా వ్యాధిని నయం చేయొచ్చు. ఊపిరితిత్తులు, హృదయం, ప్లీహంలోని గాయాలకు తక్కువ వ్యవధిలో చికిత్స అందిస్తారు. కణతి రకాన్ని బట్టి ప్రతి చికిత్సా 30 నుంచి 90 నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది. చికిత్స తర్వాత రోగి ఎప్పటిలాగే అన్ని పనులూ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *