“జుత్తు జుట్టు పెరుగుదల చమురు +హెయిర్ లాస్ ఎండ్”

‘త్రిష’ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘నాయకి’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమౌతున్న ఈ చిత్ర టీజర్..ఆడియో ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ‘త్రిష’ ఓ పాట కూడా పాడింది. గోవి దర్శకత్వంలో రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాతలు మీడియాకు తెలిపారు. తొలుత ఈ చిత్రాన్ని ఈనెల 8న విడుదల చేయాలని అనుకున్నట్లు, కానీ తమిళంలో ఎదురైన సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 15న రెండు భాషాల్లో చిత్రాన్ని విడుదల చేయడం జరుగుతుందన్నారు. విభిన్న కోణాలున్న త్రిష పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, సినిమాలో 40 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయన్నారు. మరి త్రిష ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ? లేదా ? అనేది 15న తెలుస్తుంది.

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు చేరారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు లేవని, అవినీతి సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుక్కొంటున్నారని ఆరోపించారు. 

30/05/2016: ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ అణు కార్యక్రమ పితామహుడు అబ్దుల్‌ ఖదీర్‌ ఖాన్‌ తీవ్ర వ్యాఖ్యలతో కలకలం సృష్టించారు. అణ్వస్త్ర సామర్థ్యం గల తమ దేశం భారత రాజధాని దిల్లీపై ఐదు నిమిషాల్లో దాడి చేయగలదంటూ నోరుజారారు. పాక్‌ తొలిసారి అణు పరీక్షలు నిర్వహించి 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా శనివారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఖాన్‌ ప్రసంగించారు. రావల్పిండి సమీపంలోని కహుతా నుంచి దిల్లీని ఐదు నిమిషాల్లో లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యం పాక్‌కు ఉందని వ్యాఖ్యానించారు. 1984కు ముందే పాక్‌ అణ్వాయుధ దేశంగా మారేదని… అయితే, అప్పటి దేశాధ్యక్షుడు జనరల్‌ జియా ఉల్‌ హక్‌ అందుకు నిరాకరించారని వెల్లడించారు. తన సేవలు లేకపోతే… తొలి ముస్లిం అణ్వాయుధ దేశంగా పాక్‌ అవతరించి ఉండేది కాదని ఖాన్‌ పేర్కొన్నారు. అణుశాస్త్రవేత్తల పట్ల పాక్‌ గౌరవంగా వ్యవహరించట్లేదని అభిప్రాయపడ్డారు.1998లో ఖాన్‌ పర్యవేక్షణలోనే పాక్‌ తొలిసారి అణు పరీక్షలు నిర్వహించింది. అణు సాంకేతికతకు సంబంధించిన సమాచారం బహిర్గతం కావడానికి బాధ్యుడిగా ఖాన్‌పై ఆరోపణలున్నాయి. 2004 నుంచి ఐదేళ్లపాటు ఆయన గృహనిర్బంధంలో ఉన్నారు. 2009లో ఇస్లామాబాద్‌ హైకోర్టు గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగదు: ఖదీర్‌ ఖాన్‌ వ్యాఖ్యలపై భారత మేధావులు మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవని హితవు పలికారు. ఐదు నిమిషాల్లో దాడి అసాధ్యమని… దాడికి కనీసం ఆరు గంటలు పడుతుందని స్పష్టంచేశారు. మొత్తం పాక్‌ భూభాగంపై అణ్వాయుధాలతో విరుచుకుపడగల సామర్థ్యం భారత్‌కు ఉందని సూచించారు. అయితే, అణ్వాయుధాలున్నవి యుద్ధం చేయడానికి కాదని… భయనివారణులుగా మాత్రమే వాటిని వినియోగించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఖాన్‌ వ్యాఖ్యలపై మాజీ సైనికాధిపతి జనరల్‌ ఎన్‌.సి.విజ్‌, బ్రిగేడియర్‌(రిటైర్డ్‌) గుర్మీత్‌ కన్వాల్‌, ఎయిర్‌ వైస్‌ మార్షల్‌(రిటైర్డ్‌) మన్మోహన్‌ బహదూర్‌ వేర్వేరుగా ఆదివారం స్పందించారు.

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శికి శనివారం వరకూ అధికారులు సెలవులు ప్రకటించారు. అటు హెచ్ సీయూ లోపలికి పోలీసులు ఎవ్వరికీ అనుమతి ఇవ్వడంలేదు. ప్రధాన గేటు దగ్గర మీడియాను పోలీసులు ఆపేశారు. లోపలికి అనుమతిలేదని తేల్చి చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు నగర పోలీస్‌ కమిషనర్‌కు యూనివర్శిటీ రిజిస్ట్రార్ లేఖ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఉద్రిక్తత చల్లారేవరకూ వర్శిటీలోకి మీడియా, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఇతర విద్యార్థులను అనుమతించొద్దంటూ నగర పోలీస్‌ కమిషనర్‌ లేఖ రాశారు.. ఈ లేఖపై విద్యార్థులు మండిపడుతున్నారు. 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మైగ్రేన్,Migraine- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

న్యూదిల్లీ: సోనియా గాంధీ కుటుంబానికి నరేంద్ర మోదీ రహస్యాలు అన్నీ తెలుసని.. అవే వారిపై ప్రధాని ఎటువంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ఆరోపించారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాను అరెస్టు చేసే ధైర్యంలేదని నిన్న జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేసిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గాంధీ ఫ్యామీలి దగ్గర మోదీ రహస్యాలు ఉన్నాయి.. అందుకే ఆయన చర్యలు తీసుకోవట్లేదని నేడు కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

‘భల్లాలదేవ’గా అదరగొట్టిన దగ్గుబాటి రానా.. ఇప్పుడు ‘మహారాజ మార్తాండ వర్మ’గా ప్రేక్షకులను అలరించబోతున్నారు. కేరళలోని ట్రావన్‌కోర్‌ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్‌ మార్తాండ వర్మ జీవితాధారంగా ఓ చిత్రం ….

27/07/2016: చండీగఢ్‌: సామూహిక అత్యాచారాలు, పరువు హత్యలు, లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వంటి ప్రతికూల అంశాలతో వార్తల్లో ఉండే హర్యానాలో ఓ సానుకూల కథనం వెలుగు చూసింది. జింద్ జిల్లాకు చెందిన యువరైతు ఒకరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి కొత్త జీవితం ఇచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా న్యాయపోరాటానికి దన్నుగా నిలిచాడు. లాయర్ కావాలన్న ఆమె ఆకాంక్షను నెరవేర్చేందుకు తనవంతు మద్దతు అందించాడు. జింద్ జిల్లాలోని ఛాతర్ గ్రామానికి చెందిన జితేందర్(29) గతేడాది డిసెంబర్ 4న సామూహిక అత్యాచార బాధితురాలిని పెళ్లాడాడు. తన భార్య చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలిచాడు. తన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో తప్పించుకుని తిరుగుతున్న ఒక దుండగుడి అరెస్ట్ కోసం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ జోక్యం చేసుకోవాలని అతడు కోరుతున్నాడు. తన భార్యకు నైతిక మద్దతు అందిస్తూనే ఆమె చదువుకోవడానికి సాయమందిస్తున్నాడు. ‘నా భార్య న్యాయవిద్య చదవాలనుకుంటోంది. లాయర్ కావాలన్నది తన లక్ష్యం. అత్యాచార బాధితులకు అండగా నిలవాలనుకుంటోంది. లైంగిక వేధింపుల బాధితుల తరపున పోరాటానికి ఇప్పటికే యూత్ ఎగెనెస్ట్ రేప్ అనే సంస్థను ఏర్పాటు చేశామ’ని జితేందర్ తెలిపాడు. తన భర్త అందిస్తున్న సహాయంతో తన లక్ష్యాలను సాధించగలనన్న విశ్వాసాన్ని జితేందర్ భార్య వ్యక్తం చేసింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె లక్ష్యాలకు అండదండలు అందిస్తున్న జితేందర్ ను ఆదర్శప్రాయుడిగా జనమంతా కొనియాడుతున్నారు.

02/08/2016: వారణాసి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నేడు ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం ప్రారంభించారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలోనే ఆమె ప్రచారం మొదలు పెట్టడం విశేషం. విమానాశ్రయం నుంచి సోనియా గాంధీ కాన్వాయ్‌తో పాటు వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు జెండాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సోనియా గాంధీ పలుచోట్ల రోడ్‌షోలో పాల్గొన్నారు. మోదీ సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బలాన్ని చాటుకోవడానికే సోనియా తొలి ప్రచార కార్యక్రమానికి వారణాసిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రధానిగా నియమితులయ్యాక సోనియాగాంధీ వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి. సోనియా ఈరోజు సాయంత్రం అక్కడి కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్లనున్నారు. ఆమెతో పాటు యూపీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్‌, యూపీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌, పార్టీ సీనియర్‌ నేతలు ప్రమోద్‌ తివారీ, సంజయ్‌ సింగ్‌లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గత 27ఏళ్లుగా కాంగ్రెస్‌కు అధికారం దక్కలేదు. వచ్చే ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందనే అంశంపైనే కాంగ్రెస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రచారం చేయనుంది.

విటమిన్ బి2 పుష్కలంగా కలిగి ఉన్న ఆహారపదార్థాలను తీసుకున్నప్పుడు జీర్ణప్రక్రియ ద్వారా చిన్న పేగుల ద్వారా రక్తంలో కలుస్తుంది. రక్తప్రవాహం నుంచి కణసముదాయాలకు (టిష్యూస్) అక్కడ నుంచి కణాల్లోకి వెళ్లి సెల్ ఎంజైమ్స్‌తో కలిసి శరీర జీవక్రియలకు ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా కాలేయంలో నిల్వ ఉంటుంది. మన శరీరంలోని మొత్తం రైబోఫ్లేవిన్‌లో మూడో వంతు కాలేయంలోనే ఉంటుంది.అంతేకాదు… మూత్రపిండాలు, గుండెలో కూడా ఈ విటమిన్ ఉంటుంది. అయితే శరీరం దీన్ని ఎక్కువ పరిమాణంలో నిల్వ ఉంచుకోదు. క్రమం తప్పకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలతో ఎప్పటికప్పుడు శరీరానికి అవసరమైన విటమిన్ బి2 అందించాల్సిందే. అయితే మన శరీర అవసరాలకు మించి ఎక్కువగా ఉన్న రైబోఫ్లేవిన్ ప్రధానంగా మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. అయితే బైల్, చెమట మార్గాల్లో చాలా కొద్ది మోతాదుల్లో బయటకు విసర్జితమవుతుంది.

బెల్లంకొండ శ్రీనివాస్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’. బోయపాటి శ్రీను దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. రోడ్డుపక్కన బైక్‌పై రకుల్‌ దీనంగా చూస్తుంటే.. శ్రీనివాస్‌ నవ్వుతూ ఓపక్కకు..వేలు చూపిస్తున్నట్లుగా….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *